వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ 'శ్రీదేవి బంగ్లా' సినిమాతో బాలీవుడ్ కి పరిచయం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ లతో బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలను తనవైపు తిప్పుకుంది.

దానికి కారణం.. ఈ సినిమాలో ఆమె నటి శ్రీదేవి పాత్ర పోషించడమే. బాత్ టబ్ లో పడి ఉండడం, శ్రీదేవి బంగ్లా టైటిల్ తో పటు ఇందులో ప్రియా ప్రకాష్ క్యారెక్టరైజేషన్ కూడా శ్రీదేవిని పోలినట్లే ఉంది. శ్రీదేవి డెత్ మిస్టరీ నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దీంతో శ్రీదేవి భర్త బోనీ కపూర్ చిత్రబృందానికి నోటీసులు పంపించారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ తాజాగా మరో టీజర్ ని విడుదల చేసింది. ''నాకు ఎంత మంది ప్రపోజ్ చేశారో నీకు తెలుసా..?'' అంటూ ప్రియా ప్రకాష్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది.

'దునియా మొత్తం నీ న్యూడ్ లైఫ్ చూస్తుంది' అని ప్రియాని ఓ వ్యక్తి బెదిరించడం అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ప్రశాంత్ మాంబుల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.