పోర్న్ స్టార్ తో ప్రియాప్రకాష్ వారియర్.. బిగ్ బాస్ లో ఎంట్రీ!

First Published 24, Jul 2018, 4:33 PM IST
priya prakash varrier to appear in salman khan bigg boss
Highlights

పోర్న్ స్టార్ డెనిడి, మిస్ ఇండియా బికినీ నిఖితా గోఖలే ఈ షోలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఈ షోలో ప్రియాప్రకాష్ వారియర్ కూడా కనిపించబోతుంది టాక్. తన కో స్టార్ రోషన్ అబ్దుల్లాతో పాటు ఆమె ఈ షోలో పాల్గొనుందని అంటున్నారు

కేవలం ఒకే ఒక్క చూపుతో కుర్రకారు మనసులను దోచుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ గురించి మనకు తెలిసిందే. 'ఒరు ఆడార్ లవ్' అనే మలయాళీ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. అయితే 'మాణిక్య మలరయ' పాట ఆమెకు తీసుకొచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆ పాట విడుదలయ్యాక.. తనకు వివిధ సినీ పరిశ్రమల నుండి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. నిజం చెప్పాలంటే..ఒక్క వీడియోతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నటి ప్రియా ప్రకాష్.

ఆమెకు యాడ్స్ లో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ బిగ్ బాస్ షోలో పాల్గొనుందని టాక్. త్వరలోనే హిందీలో బిగ్ బాస్ సీజన్ 12 ప్రారంభం కానుంది. గత రెండు సీజన్లలో పోటీదారులుగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు కూడా అవకాశం కల్పించారు. అయితే ఈసారి 'మేకర్స్ జోడీ' అనే కాన్సెప్ట్ తో ముందుకు రానుంది బిగ్ బాస్ షో. తల్లీ-కొడుకు, లెస్బియన్ జంట, గే కపుల్, ఇలా కొన్ని జంటలు ఈ షోలో దర్శనమివ్వబోతున్నాయి.

ఇప్పటివరకు సెలబ్రిటీల ఫైనల్ లిస్ట్ బయటకు రానప్పటికీ కొందరు సెలబ్రిటీల పేర్లు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. పోర్న్ స్టార్ డెనిడి, మిస్ ఇండియా బికినీ నిఖితా గోఖలే ఈ షోలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఈ షోలో ప్రియాప్రకాష్ వారియర్ కూడా కనిపించబోతుంది టాక్. తన కో స్టార్ రోషన్ అబ్దుల్లాతో పాటు ఆమె ఈ షోలో పాల్గొనుందని అంటున్నారు. 
 

loader