Asianet News TeluguAsianet News Telugu

కరోనా టెస్ట్ రిపోర్ట్ షేర్ చేసిన స్టార్ హీరో


కోవిడ్ 19 రిపోర్ట్‌ని పృథ్వీరాజ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ.. ఇంటికి వ‌చ్చే ముందు కంప్లీట్‌గా క్వారంటైన్‌లో ఉన్నాం. మీరు ఇంటి ప‌ట్టున ఉండండి. జాగ్ర‌త్త‌లు వ‌హించండి అని కామెంట్ పెట్టాడు. త‌న అభిమాన హీరోకి కోవిడ్ 19 రిపోర్ట్స్ నెగెటివ్ రావ‌డంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. 

Prithviraj tests negative for coronavirus
Author
Hyderabad, First Published Jun 3, 2020, 4:04 PM IST


మలయాళ  స్టార్ హీరో  పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు బ్లెస్సీ తో పాటు 58 మంది ఆదుజీవితం చిత్రం టీమ్ లాక్‌డౌన్  కార‌ణంగా జోర్డాన్‌లో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల వారంద‌రిని ప్ర‌త్యే ఫ్లైట్ ద్వారా ఇండియాకి తీసుకొచ్చారు. అయితే జోర్డాన్‌లో క‌రోనా ఉదృతి ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో వీరంద‌రిని క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా పృథ్వీరాజ్ కోవిడ్ 19 టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తన అభిమానులందరికీ తెలియచేసేందుకు సోషల్ మీడియాలో షేర్ చేసారు.

కోవిడ్ 19 రిపోర్ట్‌ని పృథ్వీరాజ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ.. ఇంటికి వ‌చ్చే ముందు కంప్లీట్‌గా క్వారంటైన్‌లో ఉన్నాం. మీరు ఇంటి ప‌ట్టున ఉండండి. జాగ్ర‌త్త‌లు వ‌హించండి అని కామెంట్ పెట్టాడు. త‌న అభిమాన హీరోకి కోవిడ్ 19 రిపోర్ట్స్ నెగెటివ్ రావ‌డంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. 

ఇక తమిళ దర్శకుడు బ్లెస్సీ డైరక్షన్ లో తెర‌కెక్కుతోన్న "ఆడు జీవితం" సినిమాలో మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్నాడు. ఈ సినిమా జోర్డాన్‌లో షూటింగ్ జ‌రుపుకుంది. క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో షూటింగ్  ఆపేయాల‌ని అధికారులు కోరారు. అయితే వెన‌క్కి వ‌చ్చి, తిరిగి మ‌ళ్లీ షూటింగ్ జ‌రుపుకోవాలంటే ఖ‌ర్చు చాలా అయ్యిపోతుందనే ఉద్దేశ్యంతోనే సినిమా యూనిట్ ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకుని అక్కడే ఉండిపోయారు.

అంతేకాదు సినిమా యూనిట్‌ ఏప్రిల్ 10 వ‌ర‌కు షూటింగ్ కోసం అక్క‌డి అధికారుల ద‌గ్గ‌ర నుంచి ప‌ర్మిష‌న్ తీసుకుంది. మొదట ఇందుకు అక్క‌డి అధికారులు అంగీక‌రించిన‌ప్ప‌టికీ ప‌రిస్థితి విష‌మిస్తున్నందున త‌మ నిర్ణ‌యాన్ని విర‌మించుకున్నారు.షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఆడు జీవితం టీమ్ స‌భ్యులు 58 మంది జోర్డాన్ ఎడారిలో చిక్కుకుపోయారు. తర్వాత  ఈ క్ర‌మంలో ఎలాగైనా మాకు సహాయపడాలని దర్శకుడు బ్లెస్సీ కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాశాడు. 

అన్న‌పానీయాలు సైతం అందుబాటులో ఉండ‌ట్లేద‌ని, కేర‌ళ‌కు తిరిగి వ‌ద్దామ‌న్నా విమానాల రాక‌పోక‌లు స్థంభించిపోయాయ‌ని పేర్కొన్నాడు. ప్ర‌భుత్వ సాయం లేనిదే కేర‌ళ‌కు రావ‌డం దాదాపు అసాధ్య‌మ‌ని వాపోయాడు. మా స‌మస్య‌కు ప్ర‌భుత్వ‌మే ప‌రిష్కారం చూపాల‌ని లేఖ‌లో అభ్య‌ర్థించాడు.  ఈ క్రమంలో వారిని ఇండియాకు రప్పించి క్వారంటైన్ లో ఉంచారు.

Follow Us:
Download App:
  • android
  • ios