Asianet News TeluguAsianet News Telugu

Kaduva: `భీమ్లానాయక్` సీక్వెల్ లా ఉందే..టీజర్ చూసారా?

కథ చెప్పినపుడు ఇదో బుల్ ఫైట్ లా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ లో నిజంగానే రెండు పెద్ద బుల్స్ తీసుకొచ్చి ఫైట్ చేయించారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది

 Prithviraj Sukumaran kaduva telugu teaser
Author
Hyderabad, First Published Jun 26, 2022, 9:24 AM IST


పృథ్వీరాజ్ హీరోగా నటించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` ని తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `భీమ్లానాయక్` గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ సినిమా సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా భావించారు. అయితే తాజాగా పృధ్వీరాజ్ నటించిన చిత్రం కడువా టీజర్ చూస్తూంటే... `అయ్యప్పనుమ్ కోషియుమ్`  సీక్వెల్ తీసారా అనిపించేలా ఉంది. ఎందుకంటే పృధ్వి రాజ్ పాత్ర..ఓ పోలీస్ తో తలపడటం యాజటీజ్  `అయ్యప్పనుమ్ కోషియుమ్` ని గుర్తు చేస్తోంది. తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అవుతూండటంతో ఇక్కడ ప్రమోషన్ లో భాగంగా టీజర్ రిలీజ్ చేసారు..మీరూ ఓ లుక్కేయండి...
 
 ఈ మూవీ టీజర్ ని హీరో నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. `ఎవడ్రా మీ ఊళ్లో కురియన్ అంటా .. వాడెవరడో కొత్తోడైవుంటాడు సర్.. ఊళ్లో వాడికి ఇంకో పేరుంది...కురువశ్చన్.. కడువా కురియన్ కురువశ్చన్`.. అంటూ సాగే సంభాషణలతో టీజర్ మొదలైంది. ఆయనొక చిరుత సార్..వేట కోసం కాచుకున్న చిరుత` అంటూ పృథ్వీరాజ్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తున్న తీరు.. వైట్ అండ్ వైట్ లో చేతికి చిరుత సింబల్ గోల్డ్ రింగ్ ధరించి పృథ్వీరాజ్ పోలీసులని చిరుతలా మట్టి కరిపిస్తున్న తీరు ఎక్సపెక్టే,న్స్ క్రియేట్ చేస్తోంది. పవర్ ఫుల్ పోలీసు పాత్రలో  వివేక్ ఒబెరాయ్‌ కనిపించారు. యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అవుట్ స్టాండింగ్ అనిపించాయి. టీజర్ చివర పృథ్వీరాజ్ పులిలా గర్జించడం మాస్ ని మెస్మరైజ్ చేసింది

 చిత్రం వివరాల్లోకి వెళితే...మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కడువా. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్  హీరోయిన్ గా కనిపించనున్నారు. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘ కడువా’ జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. .

డైరెక్టర్ షాజీ కైలాస్ కడువాతో మరోసారి తన మాస్ మార్క్ ని చూపించబోతున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి. అభినందన్ రామానుజం అందించిన విజువల్స్ రిచ్ అండ్ లావిష్ గా వున్నాయి.  జేక్స్ బిజోయ్ అందించిన నేపధ్య సంగీతం మాస్ ని మరింత ఎలివేట్ చేసింది. పృథ్వీరాజ్ హైవోల్టేజ్ యాక్షన్, భారీ నిర్మాణ విలువలు, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

Follow Us:
Download App:
  • android
  • ios