కళా రంగానికి, నటనకు ఎల్లలు లేవు. ప్రాంతాలకు అతీతంగా ఆదరాభిమానులు చురగొంటారు. తాజాగా విలక్షణ నటుడు జయప్రకాష్‌ రెడ్డికి జాతీయ స్థాయిలో సంతాపం తెలియజేస్తున్నారు. బాలీవుడ్‌తోపాటు, సౌత్‌ పరిశ్రమల ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. 

తాజాగా దేశ ప్రధాన నరేంద్రమోడీ సంతాపం తెలియజేయడం విశేషం. జయప్రకాష్‌ రెడ్డి హఠాన్మరణంపై మోడీ తెలుగు సంతాపం చెబుతూ నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా మోడీ స్పందిస్తూ, జయప్రకాష్‌ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నార`ని తెలిపారు. 

ఇంకా చెబుతూ, తన సుదీర్ఘ సినీ యాత్రలో ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. ఓం శాంతి` అని ట్వీట్‌ చేశారు. మోడీ తెలుగులో సంతాపం చేయడం ఆకట్టుకుంటుంది.