బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా ప్రస్తుతం ఐపీఎల్ టీం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు కో ఓనర్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌ దుబాయ్‌ లో జరుగుతుండటంతో ప్రీతి, లాస్‌ ఏంజెల్స్‌ నుంచి దుబాయ్ చేరుకుంది. అయితే కోవిడ్ నేపధ్యంలో భద్రతా కారణాల దృష్ట్య ప్రీతి ప్రస్తుతం కార్వెంటైన్‌లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకు రెగ్యులర్‌గా కోవిడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు ఐపీల్‌ నిర్వాహకులు.

ఇప్పటికే వరకు చేసిన టెస్ట్‌లలో ప్రీతికి నెగెటివ్‌ రావటంతో కాస్త ఊపిరి పీల్చుకున్న ఈ బ్యూటీ చివరగా చేయబోయే టెస్ట్ విషయంలో నర్వెస్‌గా ఫీల్ అవుతుందట. అయితే అదే సమయంలో తాను బయటకు వెళ్లబోతున్నందుకు ఆమె చాలా ఆనందంగా ఉన్నట్టుగా వీడియో మెసేజ్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది ప్రీతి జింతా. తాను క్వారెంటైన్‌లో ఉన్న సమయంలో ఎవరినీ కలవక పోయినా ఈ టెస్ట్ విషయంలో ఆందోళనగా ఉన్నట్టుగా వెల్లడించదిం ప్రీతి జింతా.

ప్రస్తుతం హోటల్‌ రూంకే పరిమితమైన తాను బోర్ ఫీల్ అవ్వకుండా ప్రతీ క్షణం టచ్‌లో ఉన్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్వారెంటైన్‌ సమయంలో తాను భర్త జీనీ గుడ్‌ఎనఫ్‌ను మిస్‌ అవుతున్నట్టుగా చెప్పింది ప్రీతీ. సెప్టెంబర్ 19న దుబాయ్‌లో ఐపీల్‌ ప్రారంభం కానుంది తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుండగా, రెండో మ్యాచ్‌లో క్రింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి.