సినిమావాళ్లు సాధారణంగా సమాజంలో జరుగుతున్న అంశాలను ఆధారం చేసుకుని కథలు రాయాలని తాపత్రయపడుతూంటారు. అలాంటి అంశాలైతే జనం బాగా కనెక్ట్ అవుతారనేది వారి నమ్మకం. అదే పద్దతిలో  ప్రకృతి విపత్తులపై సినిమాలు చేస్తూంటారు. ఎక్కువగా ఇలాంటివి హాలీవుడ్ లో జరుగుతూంటాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అలాంటి సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. కరోనా వైరస్ నేపధ్యంలో ఓ సినిమా తెలుగులో రాబోతోందని సమాచారం. ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే  స్టార్ట్ అయ్యిందని చెప్తున్నారు టాలీవుడ్ వ‌ర్గాలు.

వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలతో కూడిన అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రాణ భయం తో ప్రజలు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాలు విశేష కృషి చేస్తున్నాయి. అంతేకాదు ప్రాణాలకు తెగించి వైద్య బృందాలు, పోలీస్ శాఖ, అనేక డిపార్ట్ మెంట్స్ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇలాంటి నేపధ్యంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, తదితర పరిస్దితులపై ఒక మూవీ రూపొందనుంది. ఆ డైరక్టర్ మరెవరో కాదు ప్రశాంత్ వర్మ. 

“అ !”, “కల్కి”వంటి వైవిధ్య భరిత మూవీస్ రూపొందించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కరోనా మహమ్మారి బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే మన దేశంలో కరోనా వైరస్ అటాక్ చేయక ముందే ఇటువంటి థీమ్ తో మూవీ రూపొందించాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసినట్టు  చెప్తున్నారు. ఒక అప్ కమింగ్ హీరోతో రూపొందించే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. అంతేకాదు షూటింగ్ పార్ట్ సగ భాగం పూర్తైనట్లు కూడా చెప్తున్నారు.  విభిన్నమైన సబ్జెక్టులతో సినిమాలు తీసే దర్శకుడిగా ముద్ర పడిన ప్రశాంత్ వర్మ, ఈ మూవీ ని రూపొందిస్తున్నారు.