ప్రస్తుతం  ‘సాహో’ తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో భారీ సోషియో ఫాంటసీ మూవీ  చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ స్పీడ్ చేసారు.అలాగే ఇప్పటికే నాగ్ అశ్విన్‌ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసి లాక్ చేసాడట. అంతవరకూ బాగానే ఉంది కానీ ఈ సినిమా ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎప్పుడు ప్రారంభమవుతుంది...ఎప్పుడు పూర్తవుతుంది అనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా అభిమానుల్లో మిగిలింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రోజూ వారీ చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం గమనించిన అశ్వినీద్...వివరణ ఇవ్వటానికి పూనుకున్నారు.

 నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. నిజానికి ప్రభాస్‌ను హీరోగా మా సంస్థ ద్వారా పరిచయం చేయాలనుకున్నాము. కానీ కుదరలేదు. ఈలోగా బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ హీరో గా ఎదిగాడు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్.. ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ కథ రాసాడు. ఆ స్టోరీ విని నేను  ఆశ్చర్యపోయాను. ప్రభాస్ అయితేనే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందని నాగ్ అశ్విన్ అన్నాడు. ఆ తర్వాత ఈ కథను ప్రభాస్‌కు వినిపించడం.. ఆయన ఓకే చేయడం జరిగింది. ఈ సినిమాను ఈ యేడాది అక్టోబర్‌లో మొదలుపెట్టి.. 2022 ఏప్రిల్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నామని చెప్పుకొచ్చారాయన. 

అందుతున్న సమాచారం మేరకు నాగ్ అశ్విన్- ప్రభాస్ ప్రాజెక్టు కోసం దాదాపు 400 కోట్ల బడ్జెట్ కు రెడీ అవుతున్నారట. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామి ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.  ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కియారా అద్వానీ నటించబోతున్నట్టు సమాచారం. షూటింగ్స్ తిరిగి ప్రారంభం అయ్యాక రాధాకృష్ణ కుమార్ సినిమాను రెండు నెలల్లో ముగించి అక్టోబరులో అశ్విన్ సినిమాను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట ప్రభాస్.