యంగ్ రెబల్ స్టార్ కరోనా కే ఛాలెంజ్ వదులుతున్నాడా అంటే అవునని అంటున్నారు సోషల్ మీడియా జనం. ఓ ప్రక్కన ప్రపంచాన్ని కరోనా వ్యాధి కుదిపేస్తోంది. ఇండియా సైతం అప్రమత్తమైంది. హైదరాబాద్ లోనూ షూటింగ్ లు ఆపు చేసుకుంటున్నారు. చిరంజీవి తన ఆచార్య షూటింగ్ సైతం ఆపేసి,సైలెంట్ అయ్యిపోయారు. ఇలాంటి విపత్కర పరిస్దితుల్లో ప్రభాస్..యూరప్ కు షూటింగ్ కు బయిలుదేరాడు అనగానే అందరూ బయిలుదేరారు. ఏంటి ప్రభాస్ ఇలా చేస్తున్నాడు అని అభిమానులు సోషల్ మీడియాలో ప్రేమతో కస్సుమన్నారు. 

మీరేమనుకున్నా నాకేంటి అన్నట్లు ప్రభాస్..జార్జియాలో షూటింగ్ స్టార్ట్ చేసాడు. ఇప్పటికే నా సినిమా లేటు అంటున్నారు. ఇంక ఆపేది లేదన్నట్లు రెగ్యులర్ షూట్ లో పాల్గొంటున్నాడు. ప్రభాస్ కు తోడు కోసం పూజా హెగ్డే కూడా వెళ్లింది. అంతేకాకుండా ముఖానికి ఓ మాస్క్ పెట్టుకుని ఓ సెక్సీ ఫొటో దిగి సోషల్ మీడియాలో వదిలింది. ఇక అక్కడ  షూటింగ్ స్పాట్ లో 10 డిగ్రీల చలి ఉంది. దీనికి తోడు వాన కురుస్తోంది. 

ఇవన్నీ కరోనా వ్యాప్తి చెందడానికి ఇది ఎంతో అనుకూలమైన వాతావరణ లక్షణాలు. అయినా సరే యూనిట్ మాత్రం " టీమ్ స్పిరిట్" అంటూ కొటేషన్లు కొడుతూ షూటింగ్ చేసేస్తున్నారు. ఇక ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో అసలు యూరోప్ షెడ్యూల్ పెట్టుకోవడమే చాలా పెద్ద తప్పు.అదీ ముఖ్యంగా స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల్ని కరోనా వణికిస్తున్న టైమ్ లో అటు వైపు వెళ్లడం ఇంకా డేంజర్. ఇలాంటి టెన్షన్ మధ్య షూటింగ్ పెట్టుకోవటం అంటే ప్రభాస్ ..డైరక్ట్ గా కరోనాకు ఛాలెంజ్ విసరమే అంటున్నారు. మరికొంతమంది ఈ రచ్చ అవసరమా ప్రభాస్ అంటూ మందలిస్తున్నారు ఫ్యాన్స్.