ప్రభాస్ హీరోగా నటిస్తున్న అనేక భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో   ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. ఈ సినిమా అనౌన్స్ చెయ్యడంతో దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున అటెన్షన్ ను సంతరించుకున్న దాంట్లో ఏ మాత్రం అబద్దం లేదు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందించనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ప్రభాస్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ల్స్ లేట్ గా ఫిక్స్ అవుతూ వస్తున్నారు. కానీ ‘సలార్’ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ క్లారిటీకి వచ్చేసారని తెలుస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు..“కేజీఎఫ్” చిత్రాలకు తనతో వర్క్ చేసిన టెక్నీషియన్లనే ఆయన ప్రభాస్ సినిమాకి కూడా రిపీట్ చేస్తున్నాడు. “కేజీఎఫ్” సినిమాకి టెర్రిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రవి బస్రుర్ కే ప్రభాస్ సినిమాకి బాధ్యతలు అప్పగించాడు ప్రశాంత్ నీల్. ఈ చిత్రం షూటింగ్ జనవరి నెలాఖరులో కానీ, ఫిబ్రవరిలో కానీ మొదలవుతుంది. కానీ ఇప్పటికే సినిమాకి సంబందించిన మ్యూజిక్ వర్క్ మొదలుపెట్టేసారట. అలాగే ఈ సినిమాకి కెమెరా మేన్ కూడా “కేజీఎఫ్”కి వర్క్ చేసిన భువన్ గౌడ పని చేయనున్నాడు. హీరోయిన్, ఇతర నటులు తప్ప… మిగతా టీం అంతా ప్రశాంత్ నీల్ తో తొలినుంచి పనిచేస్తున్నవారే ఉంటారని చెప్తున్నారు.

 ఇక ఈ సినిమా టైటిల్ అర్ధం ఏమిటి అని ఆలోచించగా దర్శకుడు నీల్ రివీల్ చేసారు. సలార్ అంటే ఒక రాజుకు రైట్ హ్యాండ్ అని చెప్పాడు. ‘మోస్ట్‌ వయోలెంట్‌ మ్యాన్‌.. కాల్డ్‌ వన్‌ మ్యాన్‌... ది మోస్ట్‌ వయోలెంట్‌.. సినిమా మీద ప్రేమతో భాషల హద్దులను చెరిపేస్తూ.. భారతీయ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.. ప్రభాస్‌ గారికి హృదయపూర్వక స్వాగతం’ అంటూ ప్రశాంత్ నీల్ పోస్టులో పేర్కొన్నారు.  హొంబెల్‌ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కేజీఎఫ్‌,  కేజీఎఫ్‌ 2ను నిర్మించిన విజయ్‌ కిరుగందుర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ వెనుక ఉన్న హోంబాలే చిత్రాలు ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తున్నాయి.
 
ఇక గతంలో కన్నడ లో ప్రశాంత్ నీల్ చేసిన ఉగ్రం అనే సినిమా సూపర్ హిట్. ఆ సినిమానే ఇప్పుడు ప్రభాస్ తో తీస్తాడని వార్తలు వస్తున్నాయి. 2014లో విడుదలైన ఈ సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. అందులో హీరో కూడా ఒక గ్యాంగ్ లీడర్ గానే కనిపిస్తాడు. ఫ్యామిలీ యాంగిల్ కూడా కలగలపి ఉండే కంప్లీట్ మాస్ చిత్రం ఉగ్రం. ఆ స్క్రిప్టుకే కాస్తంత మెరుగులు దిద్ది ప్రబాస్ తో చేయబోతున్నాడని చెప్తున్నారు.
 
 సలార్‌ సినిమాలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది జవవరిలో సలార్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.‘మేం ప్రస్తుతం చేస్తున్న ‘కేజీయఫ్‌ 2’ మీద చాలా అంచనాలు ఉన్నాయని తెలుసు. వాటన్నింటినీ మించేలా ఈ సినిమా ఉంటుంది. అలానే మా తదుపరి సినిమా కూడా ప్యాన్‌ ఇండియన్‌ సినిమాయే. అన్నారు.