బాహుబలి వంటి సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన చిత్రం సాహో. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అదే స్దాయిలో భారీగా డిజాస్టర్ అయ్యింది. అయితే నార్త్ లో కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ఆడటం కొంత రిలీఫ్ ఇచ్చింది ప్రభాస్ కు. దాంతో ఎట్టి పరిస్దితుల్లోనూ తను తాజాగా చేస్తున్న సినిమా విషయంలో మొహమాటం, రాజీ పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయానికి రావడం జరిగింది.  అయితే ఊహించని విధంగా సాహో సీన్ ఇక్కడ రిపీట్ అయ్యిందని సమాచారం. దాంతో ప్రభాస్ ...ఇలా జరిగిందేంటి అని తల పట్టుకున్నారట. 

అప్పట్లో సాహో మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఉన్న శంకర్, ఎహసాన్, లాయ్ లు మధ్యలో సినిమా వదిలేసి వెళ్లిపోయారు. సాహో నిర్మాతలు పూర్తి పాటలు కంఫోజ్ చేసే బాధ్యత వారికి ఇవ్వకపోవడంతో ఆ మ్యూజిక్ త్రయం ఈ నిర్ణయం తీసుకొని వెళ్లిపోవడం జరిగింది.ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ విషయంలో కూడా ఇదే జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. రాధా కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ మూవీగా వస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా అమిత్ త్రివేది ఎంపికయ్యారు. కారణం ఏమిటో గాని ఈ మూవీ నుండి ఆయన తప్పుకున్నారట.  దాంతో ప్రభాస్ వెంటనే డెసిషన్ తీసుకోమని మీడియా సర్కిల్స్ లో ఈ వార్త హల్ చల్ చేయకముందే వేరే డైరక్టర్ ని సీన్ లోకి తీసుకురమ్మని పురమాయించాడట.

సాహో సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా 'జిల్' ఫేం కే. రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. సాహో సినిమాని నిర్మించిన యువీ క్రియేషన్స్ వారే ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడిగా పూజా హేగ్దే నటిస్తుంది. పునర్జన్మల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
 
ఇక సినిమా తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. చందమామ కథలాంటి కథతో ఈ సినిమా సిద్ధం కాబోతుందట. ఈ ఏడాది చివర్లో సినిమా లాంచ్ చేసి వచ్చే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.