రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత చేసిన యాక్షన్ డ్రామా సాహో అనుకున్నంతగా క్లిక్కవ్వలేకపోయింది. అయితే బాలీవుడ్ లో మాత్రం పరవాలేధనిపించే విధంగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక నెక్స్ట్ ఎలాగైనా సౌత్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రభాస్ నెక్స్ట్ జాన్ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు. 

జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందట మొదలైంది. ఇక ఇప్పుడు తదుపరి షెడ్యూల్ కోసం ప్రభాస్ సిద్దమవుతున్నాడు. అక్టోబర్ ఎండింగ్ లోనే సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారట. పూజా హెగ్డే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పనులు పూర్తి చేయాలనీ దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నారు. 

ఇక త్వరలో సినిమాకు సంబందించిన స్పెషల్ లుక్ ని అలాగే టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేయాలనీ ప్రభాస్ ఆలోచిస్తున్నట్లు టాక్. ఇకపోతే ప్రస్తుతం పూర్తి నటీనటులను చిత్ర యూనిట్ సెలెక్ట్ చేసుకుంటోంది. సినిమాలో విలన్ రోల్ కోసం జగపతి బాబును ఫిక్స్ చేసినట్లు సమాచారం.   ప్రస్తుతం సౌత్ లో స్టార్ విలన్ గా అలాగే డిఫరెంట్ పాత్రలతో అలరిస్తున్న జగ్గూ భాయ్ ప్రభాస్ తో కూడా పోటీ పడేందుకు సిద్దమవుతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.