బాహుబలి సినిమాతో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ రేంజే మారిపోయింది. ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్‌తో ప్రభాస్ ప్రతీ సినిమాలో పాన్‌ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నారు మేకర్స్. బాహుబలి సినిమా తరువాత సాహోతో మరో పాన్‌ ఇండియా హిట్ సాధించిన ప్రభాస్, ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా తరువాత వరుసగా భారీ చిత్రాలను లైన్‌లో పెట్టాడు ప్రభాస్‌. ఇప్పటికే నాగ అశ్విన్ దర్వకత్వంలో ఓ భారీ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే మరో ప్రస్టిజియస్‌ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు ప్రభాస్‌. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో పౌరాణిక గాథ రామాయణం నేపథ్యంలో ఆది పురుష్‌ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్‌.

దీంతో ప్రభాస్ పేరు జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఏర్పడింది. ప్రభాస్‌కు సంబంధించిన ప్రతీ విషయం జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. అందుకు తగ్గట్టుగా ప్రభాస్‌ అభిమానులు ప్రతీ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో డార్లింగ్‌కు సంబంధించిన ట్రెండ్ హల్ చల్ చేస్తోంది. ప్రభాస్‌ బర్త్‌డేకు ఇంకా 41 రోజులు ఉండటంతో #41DaysToREBELSTARBDay అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్‌ రాధేశ్యామ్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తరువాత నాగఅశ్విన్‌ సినిమాను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ లోగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌ ఆదిపురుష్ తెర మీదకు రావటంతో ప్రభాస్‌ ముందుగా ఆ సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు.