ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ తన చిత్రాల మార్కెటింగ్ విషయంలో చెలరేగిపోతున్నారు.  కొత్త కొత్త దారులను వెతుకుతూ సొమ్ము చేసుకుంటున్నాడు. తాజాగా ఆయన వేసిన మరో ప్లాన్ ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది. అసలు ఇప్పటిదాకా ఇలాంటి ఆలోచన కూడా మాకు రాలేదేం అని నాలుక కరుచుకుంటున్నారు. అసలు వర్మ కొత్త ఆలోచన ఏమిటి....అది వర్కవుట్ అవుతుందా చూద్దాం.

వివరాల్లోకి వెళితే.... ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. త్వరలో ఈ చిత్రానికి సంభందించిన  ట్రైలర్ వదలబోతున్నాడు వర్మ. ఈ ట్రైలర్ కు ఓ రేంజిలో క్రేజ్ ఉంటుదని అందరికీ తెలుసు. దాంతో దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు ఆయన. 

అందరిలా ఈ ట్రైలర్ ని యూట్యూబ్‌లో ఫ్రీగా చూపించేయట్లేదు వర్మ. ఆ ట్రైలర్ చూడటానికి కూడా రేటు పెడుతున్నాడట. రూ.10  డబ్బులు పెడితే తప్ప ఆ ట్రైలర్ చూడలేరని వినపడుతోంది. ప్రపంచంలో ఇలా ట్రైలర్‌ను కూడా అమ్మకానికి పెట్టిన తొలి ఫిలి మేకర్ వర్మే కావచ్చు అనేది నిజం. సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి అందరూ ట్రైలర్ చూస్తారు. దాన్ని ఎక్కువమంది చూస్తే సినిమాకు ప్రయోజనం అని ఫిలిం మేకర్స్ భావిస్తారు. కానీ దానికి కూడా రేటు పెట్టాలన్న వర్మ ఆలోచన అనూహ్యం గా చెప్తున్నారు. ట్రైలర్ ని క‌నీసం ఐదారు ల‌క్ష‌లు మంది చూసినా – బ‌డ్జెట్ కేవలం ట్రైల‌ర్ తో సంపాదించుకోవొచ్చు అని వర్మ ఐడియా గా చెప్తున్నారు.