అశ్లీల వీడియో పబ్లిక్‌‌గా ఎలక్ర్టానిక్ బోర్డులపై ప్లే అయ్యింది.. దాన్ని చూసేందుకు రోడ్లపై జనాలు బారులు తీరారు. దీంతో క్షణాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, వెంటనే దాన్ని ఆపేశారు. అప్పటికే ఆ దృశ్యాలను వాహనాల్లో వెళ్తున్నవాళ్లు తమతమ ఫోన్లలో రికార్డ్ చేయడంతో ఆ విజువల్స్ వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ షాకింగ్ ఘటన జరిగింది ఎక్కడో తెలుసా? పిలిప్పీన్స్‌లోని మకాటి సిటీలో..!

నార్మల్‌గా పిలిప్పీన్స్‌లో పోర్నోగ్రఫీ చట్టరీత్యా నేరం. అంతేకాదు టీవీల్లో, సినిమాల్లో ఆ తరహా దృశ్యాలు లేకుండా జాగ్రత్త పడతారు.. అక్కడ కఠిన చట్టాలున్నాయి. అలాంటిది బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఓ ఎలక్ర్టానిక్ బిల్‌బోర్డుపై ఏకంగా పోర్న్ వీడియో ప్రసారం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇది అనుకోకుండా జరిగిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. దర్యాప్తులో బిల్‌ బోర్డు యజమాని పేరు, ఆపరేటర్లు, ఇతర ఉద్యోగులను కూడా బాధ్యులుగా చేర్చినట్లు చెప్పారు మకాటి మేయర్‌. ఈ తరహా ఘటనలు గతంలో చాలా దేశాల్లో జరిగాయి. కొన్నాళ్ల కిందట చైనాలోని ఓ సిటీలో అయితే ఓ ఆసుపత్రి ముందున్న బిల్‌బోర్డు‌లో ఉదయం ఏడుగంటల సమయంలో అశ్లీల వీడియో ప్రసారమైన విషయం తెల్సిందే!