Asianet News TeluguAsianet News Telugu

పోర్న్ రాకెట్ కేస్... రాజ్ కుంద్రాకు భారీ ఊరట, బెయిల్ మంజూరు చేసిన ముంబై కోర్ట్

ముంబై కోర్ట్ ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రూ. 50000 వేలు పూచీకత్తుపై రాజ్ కుంద్రాకు ముంబై కోర్ట్ బెయిల్ ఇవ్వడం విశేషం.

porn racket case raj kundra finally gets bail
Author
Hyderabad, First Published Sep 20, 2021, 5:54 PM IST

పోర్న్ రాకెట్ కేసులో (Porn Rocket case) ప్రధాన నిందితుడిగా ఉన్న శిల్పా శెట్టి (Shilpa shetty) భర్త రాజ్ కుంద్రా (Raj Kundra)కు బెయిల్ లభించింది. ముంబై కోర్ట్ ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రూ. 50000 వేలు పూచీకత్తుపై రాజ్ కుంద్రాకు ముంబై కోర్ట్ బెయిల్ ఇవ్వడం విశేషం. బ్రిటన్ సిటిజన్ గా ఉన్న రాజ్ కుంద్రా దేశం విడిచి పారిపోయే అవకాశము ఉందని భావించిన పోలీసులు, ఇదివరకే ఆయన పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. 


జులై నెలలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ ఆరోపణలపై అరెస్ట్ కాబడ్డారు. లండన్ కి చెందిన ఓ కంపెనీతో సంబంధాలున్న రాజ్ కుంద్రా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్, మొబైల్ యాప్ ద్వారా పోర్న్ కంటెంట్ ప్రసారం చేస్తున్నారని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు గుర్తించారు. ఆయన ఆఫీస్, నివాసం దాడులు జరిపి అడల్ట్ కంటెంట్ కి సంబంధించిన వీడియోలు, ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.

 
రాజ్ కుంద్రాతో పాటు మొత్తం 11మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. చాలా కాలంగా రాజ్ కుంద్రా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్ కుంద్రాపై పోలీసులు కోర్టుకి సమర్పించిన ఛార్జ్ షీట్ లో నేరానికి పాల్పడినట్లు బలమైన అధరాలు లేవని ఆయన తరపు న్యాయవాది, కోర్టుకి విన్నవించారు. పలుమార్లు రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్ ని తోచిపుచ్చిన ముంబై కోర్ట్, ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios