కత్తి మహేష్ కు పూనమ్ కౌర్ మరోసారి కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. వర్మ తీసిన జీఎస్టీ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రంపై ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ప్రసంశల వర్షం కురిపించడంతో... కౌంటర్ గా నే పూనమ్ తాజాగా ట్వీట్ చేసినట్లు తన ట్వీట్ ను బట్టి తెలుస్తోంది. ఆర్జీవీ విడుదల చేసిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ - GSTపై నటి పూనమ్ కౌర్ పరోక్షంగా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

 

ఇటీవల కత్తి మహేష్‌పై ఫ్యాట్లోను రోజూ టీవీల్లో చూడలేకపోతున్నాం. మార్చండిరా బాబోయ్ అంటూ ఇండైరెక్ట్ గా కకత్తి పేరు ప్రస్తావించకుండానే సెటైర్ వేసింది పూనమ్. తన ట్వీట్ తో కొత్త వివాదానాకి తెరలేపిన పూనమ్ కౌర్ కు కత్తి మహేష్ కొన్ని ప్రశ్నలు వేసి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. పూనమ్ తాజా కామెంట్ మాత్రం అందర్నీ ఆలోచింపజేసేలా ఉంది.

 

పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఆర్జీవీ రూపొందించిన ‘జీఎస్టీ’ని మెచ్చుకుంటూ కత్తి మహేష్ చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా కౌర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఇండియాలో సాధారణ భారతీయ యువతుల కంటే పోర్న్ స్టార్లే మంచి జీవితం, గౌరవాన్ని పొందుతున్నారు. ఇక్కడి యువతులు దేనిపైనైనా స్పందిస్తే వారిపై లేనిపోని నిందలు వేస్తు అసభ్యంగా మాట్లాడతారు. అంతా కలిసి ఆ యువతుల మనస్సును, శరీరాన్ని, ఆత్మను చంపేందుకు సిద్ధమవుతారు’’ అంటూ పూనమ్ ట్వీట్ చేసింది.

 

ఇటీవల వర్మ విడుదల చేసిన ‘జీఎస్టీ’ ట్రైలర్ కు క్రిటిక్ కత్తి మహేష్ సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ‘‘మియా ఒక దేహం కాదు. విశ్వవ్యాపితమైన ఒక మోహన రూపం. మియా ఒక స్త్రీ కాదు. స్త్రీ లైంగిక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు ప్రతిరూపం. కొన్ని యుగాలుగా అణచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా మియా మాటల్లో, వర్మ అనే ఒక పురుషుడు విప్పిన గొంతుక ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అని ట్వీట్ చేశాడు.

మరో ట్వీట్‌లో ‘‘షాక్ వాల్యుని దాటి ముందుకు వెళితే ఎందరో తత్వవేత్తల వేదాంతం. ఎందరో విప్లవకారుల నినాదం ఈ ట్రైలర్ లో వినిపిస్తోంది. వర్మ చెప్తున్నాడు కాబట్టి, అనుమానాస్పదంగా చూడకుండా, ఆబ్జెక్టివ్ గా చూస్తే ఒక ప్రాచీన సత్యం గోచరిస్తుంది. ఒక బలీయమైన, తృణీకరించలేని శారీరక పరమసత్యం అవగతం అవుతుంది.’’ అని పేర్కొన్నాడు.


కత్తి మహేష్ ఈ ట్వీట్లు చేసిన కొద్ది గంటల్లోనే పూనమ్ కౌర్.. పోర్న్ స్టార్ లకున్న గౌరవం కూడా భారతీయ స్త్రీలకు లేదంటూ ఈ ట్వీట్ చేసింది. దీనిపై పూనమ్ కౌర్ కు నెటిజన్ల నుండి విశేషంగా మద్దతు లభిస్తోంది. ఆర్జీవీ ‘జీఎస్టీ’కి కత్తి సపోర్ట్ చేయడంపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. సామాజికవేత్తవని చెప్పుకుంటున్న నువ్వు ‘పోర్న్’ స్టార్లను ప్రోత్సహిస్తావా? అశ్లీలతకు మద్దతు ఇస్తావా? విలువలు గురించి మాట్లాడే నీకు ఇప్పుడు విలువలు గుర్తు రావడం లేదా అంటూ కత్తిపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు.