టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్, సెక్స్ రాకెట్ వంటి విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. అమెరికాలో సెక్స్ రాకెట్ నిర్వహించిన భారతీయ జంట కిషన్, అతడి సతీమణి చంద్రకలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో అధికారులు కొందరు టాలీవుడ్ హీరోయిన్లను కూడా విచారించారు. ఈ విషయంపై ప్రముఖులు ఒక్కొక్కరుగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా నటి పూనమ్ కౌర్ కూడా ఈ విషయంపై స్పందించింది. అసలు కిషన్, చంద్రలు భార్యభర్తలే కాదని చెప్పింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పందించిన పూనమ్.. 'అమెరికాలో ఓ ఈవెంట్ కోసం వెళ్లగా.. నేను హోటల్ లో ఒంటరిగా ఉన్న సమయంలో కిషన్ కు చెందిన ఓ వ్యక్తి నా దగ్గరకి వచ్చాడు. నాకు తెలుగు అర్ధం కాదనుకొని ఎక్కువ మాట్లాడాడు. ఆ సమయంలో అతడి చెంప పగలగొట్టాను. డబ్బు ఎర చూపించడం, భయపెట్టడం వంటివి చేసి అమెరికాలో లొంగదీసుకుంటారు' అంటూ చెప్పుకొచ్చింది.