డీజే చిత్రం ముందు వరకు పూజా హెగ్డేని అంత క్యూట్ హీరోయిన్ గా మాత్రమే చూసే వారు. కానీ బన్నీ సరసన దువ్వాడ జగన్నాథం చిత్రంలో మురిసిన తరువాత పూజా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. డీజేలో పూజా తన సోయగాలతో మాయచేసింది. ప్రస్తుతం పూజా పలువురు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలని కొట్టేస్తోంది. పూజ గ్లామర్ రహస్యం ఏంటో ఇప్పుడు బయట పడింది.

పూజా హెగ్డే ఒక లైలా కోసం చిత్రంతో క్యూట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ముకుంద చిత్రంలో కూడా నటించింది. ఈ రెండు చిత్రాలలో క్యూట్ లుక్స్ లో పూజా మెప్పించింది. కానీ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ బాటపట్టి హృతిక్ రోషన్ సరసన మొహంజదారో చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

బాలీవుడ్ వెళ్ళాక పూజా గ్లామర్ డోస్ పెంచడం విశేషం. కానీ అక్కడ కూడా పూజకు సరిగా కలసి రాలేదు. 

అనూహ్యంగా అల్లు అర్జున్ సరసన డీజే చిత్రంలో నటించే అవకాశాన్ని పూజా దక్కించుకుంది. 

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించిన పూజా హెగ్డే ఈ చితం బికినిలో సైతం మెరిసి షాక్ ఇచ్చింది. పూజా బికినీ సోయగాలకు యువత ఊహల్లో తేలిపోయారు. డీజే చిత్రంలో పూజా హెగ్డే గ్లామర్ లుక్స్ అదిరిపోయాయి. సినిమా కూడా కమర్షియల్ గా విజయం సాధించడంతో ఈ అమ్మడి దశ తిరిగింది.

యువత మొత్తం పూజా జపం చేస్తుండడంతో దర్శక నిర్మాతకు కూడా ఆమె పై దృష్టి పెట్టారు. క్రేజీ ఆఫర్లు పూజ తలుపు తడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్, ఎన్టీఆర్ చిత్రంలో పూజా హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

భరత్ అనే నేను చిత్రం తరువాత మహేష్ వంశి పైడి పల్లి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఆ చిత్రానికి కూడా పూజని హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

పూజా ప్రస్తుతం యువహీరో బెల్లం కొండా శ్రీనివాస్ సాక్ష్యం చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి గాను ఆమె భారీగా పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పూజా తొలి చిత్రం నుంచి ఇప్పటివరకు పర్ఫెక్ట్ ఫిజిక్ ని మైంటైన్ చేస్తోంది. పూజా అందాల రహస్యం తాజాగా బయట పడింది. స్వతహాగానే కొందరు హీరోయిన్లు అందంగా ఉంటారు. వారి అందాలకు మరింత పదును పెట్టేలా జిమ్ లో గంటలు గంటలు కసరత్తులు చేసే హీరోయిన్లని చూస్తూనే ఉన్నాం. వారిలో పూజ హెగ్డే కూడా ఒకరు. పూజా అందాల సీక్రెట్ అదే

పూజా హెగ్డే జిమ్ లో కసరత్తు చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొద్ది క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ గా మారడం విశేషం. పూజ తన అందాలకు పదును పెడుతున్న ఈ వీడియోని కుర్రకారు తెగ చూసేస్తున్నారు.