పూజా హెగ్డే ఇనిస్ట్ర్రాలో తన అభిమానులతో ముచ్చటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో అవుతోన్న వారితో కాసేపు చాట్ చేసింది. చాట్‌లో భాగంగా ఓ నెటిజన్ ఆమెను పూల్‌లో ఉన్న ఓ ఫోటో పోస్ట్ చేయమని అడగ్గా.. పూజా హెగ్డే పూల బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లో తేలుతున్న ఫోటోను పంచుకుంది. పూజా ఆ పిక్’లో పర్పుల్ బికినీ వేసుకుని సన్ గ్లాసెస్ కూడా ధరించి అదరకొట్టింది.

దాంతో మరో అభిమాని పూజా హెగ్డేను త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేతలో ఆమె సహ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఓ పిక్‌ను షేర్ చేయమని కోరాడు. అయితే ఆమె.. జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేయడానికి బదులుగా ఆయన కుమారుడు అభయ్ రామ్‌‌తో కలిసి ఉన్న ఓ ఫోటోను పంచుకుంది. ఈ సందర్భంగా ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ అభయ్ పట్ల తన ప్రేమను తెలిపింది.  ఈ నేపధ్యంలో మరో నెటిజన్ ఒక అడుగు ముందుకేసి ఆమె నగ్న ఫోటోను పోస్ట్ చేయమన్నాడు. 
 
 దానికి చాలా తెలివిగా స్పందించిన పూజా హెగ్డే.. తన పాదాలను ఫోటో తీసి పోస్ట్ చేసింది. ఇది చూసి సదరు అభిమాని కంగుతిన్నాడు. కాగా, ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. మరోవైపు పూజా హెగ్డే సమయస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఫోటో కోరిన నెటిజన్‌‌కు సైలెంట్‌గా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిందంటూ మెచ్చుకుంటున్నారు.

ఈ ఫొటోతో పాటు చాట్‌లో భాగంగా పూజా హెగ్డే  తన అమ్మమ్మ ఫోటోను, షూటింగ్ గ్యాప్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోను, మేకప్ లేకుండా దిగిన ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోల్లో కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మహర్షి, అరవింద సమేత, దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘రాధే శ్యామ్’తో పాటు అక్కినేని అఖిల్ ‘బ్యాచ్‌లర్’ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.