క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉండగా జోష్ మీదుంది పూజ హెగ్డే. ఆమె గత చిత్రం అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అమ్మడు నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ఈ భామ హిందీకి సల్మాన్ సరసన కభీ ఈద్ కభీ దివాళి మూవీలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక తెలుగులో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో పాటు, ప్రభాస్ సరసన రాధే శ్యామ్ లో కూడా నటిస్తుంది. రాధే శ్యామ్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల కానుంది. 

కాగా కరోనా దెబ్బకి స్టార్ హీరోలు కూడా షూటింగ్ కి రావడానికి మీనమేషాలు లెక్కబెడుతుంటే పూజా మాత్రం ధైర్యంగా బరిలోకి దిగింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ లో దిగిన పూజ వెంటనే పని మొదలుపెట్టేసింది. ప్రస్తుతం ఆమె మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సెట్స్ లోని పూజ ఫోటో బయటికి రాగా ఆసక్తి రేపుతోంది. 

అక్కినేని హీరో అఖిల్ నాలుగవ చిత్రంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తెరకెక్కుతుంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ యూత్ ఫుల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరోగా మూడు సినిమాలు చేసిన అఖిల్ కి హిట్ అయితే తగల్లేదు దీనితో ఈ చిత్రంపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా వరకు షూటింగ్ పూర్తి కాగా, సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.