Asianet News Telugu

‘ధూమ్ 4’: డార్లింగ్‌తో నిర్మాత డిస్కషన్, ఫైనల్ గా డెసిషన్ ఇదీ

మొదటి భాగంలో జాన్ అబ్రహం.. రెండో భాగంలో హృతిక్ రోషన్.. మూడో భాగంలో అమీర్ ఖాన్.. విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇవన్నీ కూడా సూపర్ హిట్లే.. ఈ క్రమంలో ప్రభాస్ ‘ధూమ్ 4’కు ని అడిగారు.

Plans to make Dhoom 4 with Prabhas dropped jsp
Author
Hyderabad, First Published Jun 15, 2021, 4:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మనకిక్కడ సౌత్‌తో పాటు అటు నార్త్‌లో కూడా ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్. అందుకు నిదర్శనం ‘సాహో’ సినిమా. ‘బాహుబలి’ సినిమా కలెక్షన్స్ విషయంలో ప్రభాస్‌కు ఉన్న స్టామినా అర్దమైంది. ఆ తర్వాత ఆ నమ్మకాన్ని సోసోగా ఉన్న కంటెంట్‌తో రిలీజైన ‘సాహో’ తెలుగులో ప్లాప్ అయ్యి… హిందీలో అద్భుత విజయం సాధించడంతో..నిజమే అని ప్రూవైంది. దాంతో ప్రభాస్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ దగ్గరకు ధూమ్ 4 ప్రాజెక్టు వచ్చింది. 

ఆ మధ్యన  ‘వార్’ సినిమా పెద్ద సక్సెస్ కావడంతో.. ఆదిత్య చోప్రా  ప్రభాస్‌ను ధూమ్ 4  విషయమై సంప్రదింపులు జరిపారట. కుదిరితే ‘వార్’ సీక్వెల్‌లో లేదా ‘ధూమ్ 4’లో నటించాలని ప్రభాస్‌ను  కోరినట్లు తెలుస్తోంది. ‘ధూమ్ 4’ విషయంలో అయితే.. డార్లింగ్ విలన్ రోల్ చేయాల్సి ఉంటుంది. అయితే అందుకు ప్రభాస్ సైతం ఉత్సాహం చూపించినట్లు వినికిడి. అయితే ప్రభాస్ వరస ప్రాజెక్టులు, కరోనా బ్రేక్ లతో అన్ని ప్లాన్ లు తల క్రిందులు అయ్యాయి. దాంతో ప్రభాస్ తో ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో ముందుకు వెళ్లటం కష్టమని భావించారట ఆదిత్యా చోప్రా. ప్రభాస్ కూడా అదే చెప్పారట. దాంతో వీళ్లిద్దరు భవిష్యత్ లో కలిసి సినిమా చేద్దామనే నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతానికి బై చెప్పుకున్నారు. 

ఇక బాలీవుడ్‌లో సీక్వెల్‌ చిత్రాలకు అమితమైన క్రేజ్‌ ఉంటుంది. ఆ జాబితాలో ‘ధూమ్‌’ ప్రథమంగా నిలుస్తుంది. అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలే వీటికి అంతటి ప్రాధాన్యం తీసుకొచ్చాయి. ఇప్పటికే దీనికి సంబంధించి మూడు ఫ్రాంచేజీలు ప్రేక్షకుల్ని అలరించగా త్వరలోనే ‘ధూమ్‌ 4’ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు అక్కడి దర్శకనిర్మాతలు. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. గత చిత్రాలకు భిన్నంగా సినీ అభిమానులకు కొత్త అనుభూతి పంచేందుకు ‘ధూమ్‌ 4’లో లేడీ విలన్ పాత్ర ఉండబోతుందట. 

ఆ పాత్ర చాలా ప్రత్యేకమైందని, అలాంటి వైవిధ్యభరిత పాత్రకు దీపికా పదుకొణె అయితే బావుంటుందని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దీపికతో చర్చలు జరిపారని, ఆమె స్క్రిప్టుపై ఇష్టంగా ఉందని తెలుస్తోంది. ఈ విషయంతోపాటు, హీరో, దర్శకుల వివరాలకు సంబంధించి మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.

అభిషేక్‌ బచ్చన్‌, ఉదయ్ చోప్రాతో కలిసి ‘ధూమ్‌’లో జాన్‌ అబ్రహాం, ‘ధూమ్‌ 2’లో హృతిక్‌ రోషన్‌, ‘ధూమ్‌ 3’లో ఆమీర్‌ ఖాన్‌ సందడి చేశారు. ప్రస్తుతం దీపిక చేతిలో ‘పఠాన్‌’, ‘83’ ‘మహాభారత్‌’ చిత్రాలున్నాయి. శకున్‌ బాత్రా, సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలోనూ నటించనుంది. ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios