పిక్చర్ పర్ఫెక్ట్...  భార్య నమ్రత ఫోటోపై మహేష్ కామెంట్

ట్విట్టర్ వేదికగా మహేష్ నమ్రత ఫోటోపై స్పందించగా క్షణాల్లో వైరల్ గా మరింది. వివరాల్లోకి వెళితే ముంబై కి చెందిన ప్రముఖ సెలెబ్రిటీ ఫోటో గ్రాఫర్ అవినాష్ గోవారికర్ నమ్రతాపై ఫోటో షూట్ చేశారు. ఆయన కాప్చర్ చేసిన నమ్రతా ఫోటోలను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 
 

picture perfect mahesh comment on namrata getting viral

భార్య నమ్రత శిరోద్కర్ ఫోటోపై సూపర్ స్టార్ మహేష్ క్రేజీ కామెంట్ చేశారు. ట్విట్టర్ వేదికగా మహేష్ నమ్రత ఫోటోపై స్పందించగా క్షణాల్లో వైరల్ గా మరింది. వివరాల్లోకి వెళితే ముంబై కి చెందిన ప్రముఖ సెలెబ్రిటీ ఫోటో గ్రాఫర్ అవినాష్ గోవారికర్ నమ్రతాపై ఫోటో షూట్ చేశారు. ఆయన కాప్చర్ చేసిన నమ్రతా ఫోటోలను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 


చిన్ను అక్క నా జీవితంలో అత్యంత ప్రియమైన వ్యక్తి, అలాగే నేను తీసిన అద్భుతమైన ముఖాలలో ఒకటి.. అంటూ అవినాష్ గోవారికర్ కామెంట్ చేశారు. అవినాష్ గోవారికర్ పోస్ట్ కి మహేష్ స్పందించడం జరిగింది. నమ్రత ఫోటోలను ఉద్దేశిస్తూ పిక్చర్ పర్ఫెక్ట్ అంటూ... కామెంట్ చేశారు. భార్య నమ్రతపై మరోమారు మహేష్ తన ప్రేమను చాటుకున్నారు. 


 దాదాపు ఐదేళ్లు వయసులో పెద్దదైన నమ్రతను మహేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2005లో అత్యంత గోప్యంగా మహేష్, నమ్రత వివాహం జరిగింది. 16ఏళ్ల వైవాహిక జీవితంలో మహేష్, నమ్రత బెస్ట్ కపుల్ గా ఉన్నారు. భార్యగానే కాకుండా మహేష్ ఆంతరంగిక సలహాదారుగా నమ్రత ఉన్నారు. మహేష్ సినిమాలు, ఆయన వ్యాపారాలు, బ్రాండ్ ఎండార్స్ మెంట్ నమ్రత చూసుకుంటున్నారు. 


ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న సర్కారు వారి పాట 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios