మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న అందాల భామ కీర్తి సురేష్‌. నేష‌న‌ల్ అవార్డ్ ని కూడా కైవ‌సం చేసుకున్న ఈ భామ ప్రస్తుతం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. మ‌హాన‌టి త‌రువాత కీర్తి న‌టించిన మ‌రో అద్భుత‌మైన సినిమా పెంగ్విన్. ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాలతో సాగిపోయే ఈ చిత్రానికి ఈశ్వ‌ర్ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్ ప‌తాకం పై కార్తీక్ సుబ్బ‌రాజ్ ఈ సినిమాను నిర్మించారు. ఇక మ‌హాన‌టి చిత్రానికి థియేట‌ర్ లోనే కాదు వ‌ర‌ల్డ్ బెస్ట్ ఆన్ లైన్ స్టీమింగ్ నెట‌వ‌ర్క్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా విశేష ఆద‌ర‌ణ ల‌భించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో పెంగ్విన్ చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎక్స్ క్లూజివ్ గా ఆడియోన్స్ కి అందిచ‌బోతున్నారు. ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ లోనే జాన్ 19న‌ విడుద‌ల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు స్టార్‌ మూవీ పెంగ్వీన్ కావడం విశేషం. అలానే అమెజాన్ ప్రైమ్ కి సంబంధించిన డైరెక్ట్ టు సర్వీస్ స్లేట్ లో దీనితో పాటు మ‌రికొన్ని ఇత‌ర భాష చిత్రాన్ని ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ చేస్తున్నారు. పెంగ్విన్ తో క‌లిపి మొత్తం ఆరు సినిమాల‌ను నేరుగా త‌మ స్ట్రీమింగ్ స‌ర్వీస్ పై ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అధికారికంగా ప్ర‌క‌టించారు.