Mangalavaram: అతిగా శృంగార కోరికలు..అనారోగ్య సమస్య..మంగళవారం మూవీతో కొత్త పాయింట్ టచ్ చేసిన దర్శకుడు
మంగళవారం సినిమాతో డిఫరెంట్ కాన్సెప్ట్ ను టచ్ చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. ఎవరూ ఊహించని.. సాహసం చేయని అంశాలను ఈసినిమాలో చూపించాడు. మంగళవారం సినిమాపై చాలా మందికి ఉన్న అభిప్రాయాన్ని మార్చేశాడు దర్శకుడు.

పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో.. నందితా శ్వేత, రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అజయ్ ఘోస్ ముఖ్య పాత్రలు పోషించిన సినిమా మంగళవారం. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాను స్వాతిరె్డి గునుపాటి, ఎం సురేష్ వర్మ, అజయ్ భూపతి సంయుక్తంగా నిర్మించారు. ఈసినిమా ఈరోజు (నవంబర్ 17) రిలీజ్ అయ్యింది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో స్టార్ అయిన పాయిల్ రాజ్ పుత్.. డైరెక్టర్ అజయ్ భూపతి.. ఆసినిమా తరువాత మళ్లీ సాలిడ్ హిట్ కొట్టలేకపోయారు. ఇన్నాళ్లకు మళ్లీ ఇదేకాంబోలో మంగళవారం సినిమా రిలీజ్ అయ్యింది.
మంగళవారం సినిమా అంటే బోల్డ్ మూవీ.. అని..అజయ్, పాయల్ కాంబో అంటే.. హాట్ మూవీ అనే అభిప్రాయంలో మాత్రమే ఉన్నవారికి ఈసినిమా చూస్తేఅభిప్రాయం మారిపోతుంది. ఈసినిమా హాట్ మూవీ మాత్రమే కాదు..అంతకు మించి మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా. సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈసినిమాలో ఇంత వరకూ ఎవరూ సాహసం చేయని సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు అజయ్ భూపతి. అంతే కాదు అతిగా శృంగారం అది కూడా ఒక సమస్య అని.. దాని పర్వావసానాలు ఎలా ఉంటాయి అనేది క్లియర్ గా చూపించాడు.
చాలా మంది శృంగారం అంటే అదోరకంగా ఫీల్ అవుతుంటారు. కాని దాని వల్ల వచ్చే సమస్యను.. తనదైన కోణంలో ఆవిష్కరించడం అజయ్ భూపతికే చెల్లింది. ఒక రకంగా ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకోవడం ఓ ఛాలెంజ్ అయితే, ఆ పాత్ర చేయడం మరో ఛాలెంజింగ్, దాన్ని అంతే డేర్‌గా వెండితెరపై ఆవిష్కరించడం సైతం పెద్ద సవాల్‌తో కూడుకున్న అంశం. అయితే ఆ ఛాలెంజ్ విషయంలో దర్శకుడు అజయ్ భూపతి, అలాంటి పాత్ర చేసిన పాయల్ రాజ్‌పుత్ కూడా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.
Mangalavaaram Movie Review: `మంగళవారం` మూవీ రివ్యూ, రేటింగ్..
ఈసినిమా రిలీజ్ అయ్యి..మంచి టాక్ తెచ్చుకుంది.అజయ్ భూపతి మీద నమ్మకంతో.. పాయల్ మీద అభిమానంతో వెళ్ళిన ప్రేక్షకులకు సంతృప్తినిచ్చే సినిమా మంగళవారు. మరీముఖ్యంగా ఈసినిమాకు అజయ్ డైరెక్షన్ .. పాయల్ రాజ్ పుత్ నటనతో పాటు.. కాంతారాఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, ఆర్‌ఆర్ గట్టి సపోర్ట్ అనిచెప్పాలి. అక్రమ సంబంధాల అంశంతో తెరకెక్కిన ఈమూవీతో.. అజయ్ మరోసారి ఆడియన్స్ ను రెండున్నర గంటలు ఎంగేజ్ చేయగలిగాడు.