ఆరు లక్షలకే ఈ రేంజ్ లో అందాల ఆరబోత..?

payal raj puth remuneration for rx100 movie
Highlights

మొదట ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది తారలను సంప్రదించగా.. లిప్ లాక్ సీన్స్, టాప్ లెస్ సీన్స్ వినగానే నో చెప్పేసేవారట. ఆ సమయంలో పాయల్ సినిమా 
కథ విని ఓకే చేసిందట. స్క్రిప్ట్ పై తనకున్న నమ్మకం, తెలుగులో క్రేజ్ తెచ్చుకోవాలని ఆమె తక్కువ పారితోషికానికే పని చేసిందని సమాచారం

ఈ మధ్య కాలంలో విడుదలైన చిన్న చిత్రాల్లో 'Rx 100' సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. రిజల్ట్ సంగతి పక్కన పెడితే తొలి రోజే ఈ సినిమా కోటిన్నర షేర్ తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ పబ్లిసిటీ స్కిల్స్ తో చిత్రబృందం ఈ సినిమాపై యూత్ కి ఆసక్తి పెరిగేలా చేశారు. నిజానికి సినిమాకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడానికి కారణం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.

సినిమాలో లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. నిజానికి ఇటువంటి బోల్డ్ సీన్స్ లో నటించడానికి హీరోయిన్లు ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తుంటారు. కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం ఆరు లక్షల రెమ్యునరేషన్ కే ఈ రేంజ్ లో అందాల ఆరబోసిందట. పైగా ఆ అమ్మాయికి ఇండస్ట్రీ కొత్త కూడా కాదు. ఇప్పటికే నార్త్ లో ఒకట్రెండు సినిమాలు చేసి సీరియళ్లలో నటిస్తోంది.

అలాంటిది ఆమె తక్కువ మొత్తానికే సినిమా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది తారలను సంప్రదించగా.. లిప్ లాక్ సీన్స్, టాప్ లెస్ సీన్స్ వినగానే నో చెప్పేసేవారట. ఆ సమయంలో పాయల్ సినిమా కథ విని ఓకే చేసిందట. స్క్రిప్ట్ పై తనకున్న నమ్మకం, తెలుగులో క్రేజ్ తెచ్చుకోవాలని ఆమె తక్కువ పారితోషికానికే పని చేసిందని సమాచారం. ప్రస్తుతం నార్త్ లో ఆమెకున్న కమిట్మెంట్స్ పూర్తి చేసి టాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలని భావిస్తోందట. 

loader