ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో  పాయిల్ ఘోష్ ..తోటి నటీమణులు రిచా చద్దా, మహీ గిల్, హూమా ఖురేషి  లపై  అసభ్యకర వ్యాఖ్యలను చేసింది.  దాంతో నటి రిచా ఛద్దా కోర్టుకు వెళ్లి  పరువు నష్టం దావా వేసింది.  ఈ నేపధ్యంలో పాయల్ ఘోష్  క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని,   రిచా చద్దాపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని బాంబే హైకోర్టుకు ఆమె తరుపు లాయిర్  బుధవారం తెలిపారు.
 
 కేసు పూర్వా పరాల్లోకి వెళితే...సెప్టెంబర్ 19 న, అనురాగ్ కశ్యప్ వర్క్  కోసం కలిసినప్పుడు  తనను బలవంతం చేశాడని పాయిల్ ఘోష్"  ఆరోపించారు . అక్కడితో ఆగకుండా ఛద్దా, హుమా ఖురేషి మరియు మహీ గిల్ వంటి ఇతర నటులును ఇందులోకి లాగింది. అనురాగ్ కశ్యప్ ఎప్పుడు రమ్మంటే వాళ్లు వస్తారని, కేవలం ఫోన్ దూరంలోనే ఉంటారంటూ కామెంట్ చేసింది. ఆ విషయాలను కశ్యప్ తన వద్ద ప్రస్తావించారని కూడా ఆమె పేర్కొన్నారు.అనురాగ్  శృంగార కోరికలు తీర్చినందుకు బదులుగా ఆమెకు అవకాశాలు వచ్చాయని కామెంట్ చేసింది. 
 
ఈ నేపధ్యంలో రెండు రోజుల తరువాత, రిచా చద్దా తన న్యాయవాది తో  ఒక ప్రకటనను చేసారుతన పరువుకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడినందుకు తనకు రూ. 1.1 కోట్లు ఇవ్వాలని పాయల్‌పై పరువు నష్టం దావా వేసింది.

ఈ రోజు కోర్టు ...భోజనానికి ముందు సెషన్లో, పాయిల్ .. క్షమాపణ చెప్పాలనుకుంటున్నారా లేదా చద్దాపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలనుకుంటున్నారా అని కోర్టు  అడిగింది.  ఆ తరువాత, భోజనానంతర సెషన్లో, పాయిల్ తరుపు న్యాయవాది..“నా క్లయింట్ అభ్యర్థనను అంగీకరించారు. ఆమె క్షమాపణ చెప్పడానికి మరియు స్టేట్మెంట్ ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని పరిష్కరించడానికి ఆమె సిద్ధంగా ఉంది. ” అని చెప్పారు. 
 
అక్టోబర్ 12, సోమవారం నాటికి ఘోష్ క్షమాపణలు చెప్పి,  చద్దా తన  లాయర్ తో స్టేట్మెంట్ ఉపసంహరించుకుంటారని కోర్టు తెలిపింది.