షాక్..! బన్నీ రాజకీయాల్లోకి వస్తాడు : పవన్

షాక్..! బన్నీ రాజకీయాల్లోకి వస్తాడు : పవన్

                           

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య- ఇల్లు ఇండియా’ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్‌లో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా మాట్లాడిన పవన్ రెడ్డి 'మీకొక సీక్రెట్ చెప్తా అన్నా.. బన్నీకి రాజకీయ అవగాహన చాలా ఉన్నది. ఆయన రాజకీయాలను క్షణ్ణంగా అధ్యయనం చేస్తారు. రాబోయే రోజుల్లో మంచి పొలిటీషియన్ కూడా అవుతాడని అనుకుంటున్నాను. బన్నీ.. యు ఆర్ ఏ వెరీ గుడ్ పొలిటీషియన్ అంటూ తన మనసులో మాటను చెప్పారు పవన్'. ఇక పవన్ మాటలకు షాకైన బన్నీ నవ్వుతూనే.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ తల పట్టుకుని అలాంటిది ఏం లేదు అంటూ తల ఊపుతూ సమాధానం ఇచ్చారు అల్లు అర్జున్. 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos