Asianet News TeluguAsianet News Telugu

పవన్ పై మరోసారి ప్రేమ కురిపించిన బండ్ల గణేష్

ఓ ఇంటర్వూలో పవన్ ఖచ్చితంగా సీఎం అవుతారని మరోసారి తన ప్రేమను కురిపించిన వీడియో ఒకటి లైమ్ లైట్ లోకి వచ్చి వైరల్ అవుతోంది. అందులో పవన్ ఓ ప్యూర్ పర్శన్ అని, ఆయనతో తన అనుబంధం ప్రత్యేకమైనదని, ఆ జ్ఞాపకాలు కొన్నిటిని ఇంటర్వూలో పంచుకున్నారు. 

Pawan Kalyan Will Become CM- Bandla Ganesh
Author
Hyderabad, First Published Sep 19, 2019, 8:28 AM IST

పవన్ కళ్యాణ్ తో  సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఉన్న అనుబంధం అందిరికీ తెలిసిందే. బండ్ల గణేష్ ఎప్పుడూ పవన్ ని భగవంతుడు సృష్టించిన ఓ రేర్ పీస్ గా అభివర్ణిస్తూంటారు. పవన్ తో గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన ఆయన పవన్ పై ఈగ వాలనివ్వరు. అయితే ఆ మధ్యన కాంగ్రెస్ పార్టీలో చేరి కొన్నాళ్లు హడావుడి చేసి ఆ తర్వాత రాజీనామా చేసి సైలెంట్ అయిపోయిన ఈయన పవన్ ప్రసక్తి తేలేదు.

కానీ  ఓ ఇంటర్వూలో పవన్ ఖచ్చితంగా సీఎం అవుతారని మరోసారి తన ప్రేమను కురిపించిన వీడియో ఒకటి లైమ్ లైట్ లోకి వచ్చి వైరల్ అవుతోంది. అందులో పవన్ ఓ ప్యూర్ పర్శన్ అని, ఆయనతో తన అనుబంధం ప్రత్యేకమైనదని, ఆ జ్ఞాపకాలు కొన్నిటిని ఇంటర్వూలో పంచుకున్నారు. పవన్ ఓ రోజు ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన మాటలు ...ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. జనసేన కార్యకర్తలు కొందరు ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఆ వీడియో చేసి చాలా కాలం అయినా ఇప్పుడు దానికి క్రేజ్ రావటం విశేషం.
 
ఇక  రాజకీయాల్లోంచి బయిటకు వచ్చిన బండ్ల గణేష్  నటుడుగా మళ్ళీ ప్రస్దానం మొదలెట్టారు. అలాగే నాని హీరోగా ఓ సినిమా ని నిర్మించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు  ఓ భారీ సినిమా ను నిర్మించడానికి సన్నాహాలు మొదలు పెట్టారని వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ నటించనున్నారని, మాస్ డైరక్టర్ బోయపాటి దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఓ స్టార్ హీరో డేట్స్ కోసం గణేష్ ట్రైల్స్ లో ఉన్నాడని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios