Asianet News TeluguAsianet News Telugu

హోల్డ్ లో ‘వకీల్‌సాబ్‌’, పవన్ లాజిక్ పర్ఫెక్ట్

షూటింగ్ లు మొదలయ్యాక ఎలాంటి ప్రాక్టికల్ సమస్యలు కరోనా ఎఫెక్ట్ తో వస్తాయో తెలియకుండా ఇలాంటి భారీ ప్రాజెక్టులు మొదలు పెట్టడం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చారట. అదే సమయంలో రిలీజ్ డేట్ తెలియకుండా షూటింగ్ చేసి పెట్టుకోవటం అంటే డబ్బుని బ్లాన్ చేయటమే. కాబట్టి థియోటర్స్ వదిలాక, జనాలు వెళ్తున్నారు అనుకున్నాక..మిగిలిన ఆ కాస్త షూటింగ్ ఫినిష్ చేసి జనాలు మళ్లీ థియోటర్స్ అలవాటు పడ్డాక రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చారట. పవన్ వంటి స్టార్ హీరో సినిమా అంటే జనం కరోనాని లెక్క చేయకుండా వచ్చేస్తారు.

pawan Kalyan Vakeel Saab ON HOLD?
Author
Hyderabad, First Published Jun 6, 2020, 1:37 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పెద్ద సినిమాల షూటింగ్, రిలీజ్ ల విషయాలలో నిర్మాతలు ఆచి,తూచి అడుగులు వేస్తారు. ముఖ్యంగా ఈ కరోనా టైమ్ లో ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అడ్డంగా బుక్ అయ్యిపోతారు. ఆ విషయం సీనియర్ నిర్మాత దిల్ రాజుకు బాగా తెలుసు. అలాగే అన్ని విషయాలపై అవగాహన ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇంకా బాగా తెలుసు. షూటింగ్ లు అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ నేపధ్యంలో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ మొదట మొదలవుతుందని అందరూ అంచనా వేసారు. అయితే అందరూ ఊహలను తలక్రిందలు చేస్తూ డెసిషన్ తీసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. దిల్ రాజు, పవన్ కళ్యాణ్ ఈ షూటింగ్ విషయమై చర్చించారట. 

షూటింగ్ లు మొదలయ్యాక ఎలాంటి ప్రాక్టికల్ సమస్యలు కరోనా ఎఫెక్ట్ తో వస్తాయో తెలియకుండా ఇలాంటి భారీ ప్రాజెక్టులు మొదలు పెట్టడం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చారట. అదే సమయంలో రిలీజ్ డేట్ తెలియకుండా షూటింగ్ చేసి పెట్టుకోవటం అంటే డబ్బుని బ్లాన్ చేయటమే. కాబట్టి థియోటర్స్ వదిలాక, జనాలు వెళ్తున్నారు అనుకున్నాక..మిగిలిన ఆ కాస్త షూటింగ్ ఫినిష్ చేసి జనాలు మళ్లీ థియోటర్స్ అలవాటు పడ్డాక రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చారట. పవన్ వంటి స్టార్ హీరో సినిమా అంటే జనం కరోనాని లెక్క చేయకుండా వచ్చేస్తారు.

 తోపులాటలు జరుగుతాయి. అలాగే షోలు ఎక్కువ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో అది అసాధ్యం. అలాగే హౌస్ ఫుల్స్ కాకపోతే పెట్టిన పెట్టుబడి వెనక్కి రాదు. ఇవన్నీ పవన్ తో చర్చించిన దిల్ రాజు ఈ నిర్ణయానికి వచ్చాడంటున్నారు. ముందు తమ దగ్గర ఉన్న వి సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి వకీల్ సాబ్ మీద ఇప్పుడిప్పుడే రిలీజ్ ఆశలు పెట్టుకోవటం అనవసరం. ఎంతలేదన్నా నాలుగు నుంచి ఆరు నెలలు పట్టే అవకాసం ఉందంటున్నారు.
 
ఈ సినిమాకు ఇంకా 35 వర్కింగ్ డేస్ పెండింగ్ ఉందిట. అలాగే మినిమం రెండు నుంచి మూడు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం పడుతుంది.  అలాగే ఈ షెడ్యూల్ లో వకీల్ సాబ్ కు ఉన్న ప్లాష్ బ్యాక్ స్టోరీ ని షూట్ చేస్తారట. అందులోనే హీరోయిన్ కనపడుతుంది. ఠాగూర్ లో చిరుకు,జ్యోతికకు ఉన్న ప్లాష్ బ్యాక్ లాంటిది ప్లాన్ చేసారట. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తో వకీల్ సాబ్ ..పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా మిగిలిపోతాడట. అంతేకాదు అతని యాటిట్యూడ్ లో సైతం మార్పు వస్తుంది.  అయితే ఇవి ఒరిజనల్ వెర్షన్ లో లేవు. 
 
 ఇక ఈ సినిమాలో నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. నివేదా రోల్ చాలా ఎమోషనల్ గా సాగుతుందని.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు. మొత్తం సినిమాలోనే నివేదా నటన సూపర్ స్పెషల్ గా హైలైట్ గా ఉండబోతోందట.  అలాగే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ కి అండ్ సాంగ్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోని కపూర్ సమర్పిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios