పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెరపై కనిపిస్తే చాలు ఆయన ఫ్యాన్స్ ఊగిపోతారు. ఆయనకు సంబంధించిన ఏ అప్‌డేట్‌ వచ్చినా పెద్ద పండగే. పవన్‌కి సంబంధించిన కొన్ని అరుదైన విషయాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు. 

తాజాగా పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించి ఓ అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. టీనేజ్‌లో, సినిమాల్లోకి రాకముందు పవన్‌ ఎలా ఉన్నాడో అనే లుక్‌ ఇప్పుడు హల్‌చల్‌ చేస్తుంది. అప్పుడప్పుడే వస్తోన్న మీసాలు, గెడ్డంతో కూడిన పాస్‌పోర్ట్ సైజ్‌ ఫోటో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

అయితే ఈ ఫోటోని అభిమానులు ట్రెండ్‌ చేస్తుంటే, కొందరు నెటిజన్లు మాత్రం ట్రోల్‌ చేస్తున్నారు. ఆయన్ని భగత్‌ సింగ్‌తో పోల్చుతున్నారు. మరికొందరు `సరిలేరు నీకెవ్వరు`లోని ట్రైన్‌ సీన్లతో పోలుస్తున్నారు. ఈ మీమ్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా పవన్‌ లుక్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తుంది. 

ప్రస్తుతం పవన్‌ రెండేళ్ళ గ్యాప్‌ తర్వాత రీఎంట్రీ ఇస్తూ `వకీల్‌సాబ్‌`లో నటిస్తున్నాడు. దీంతోపాటు క్రిష్‌ డైరెక్షన్‌లో ఓ పీరియడ్‌ చిత్రం చేస్తున్నారు. అలాగే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పవన్‌ పుట్టిన రోజుని పురస్కరించుకుని విడుదలైన ఈ చిత్రాల పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.