Asianet News TeluguAsianet News Telugu

పవన్‌ ఫ్యాన్స్ కి పూనకాలు స్టార్ట్ .. బర్త్ డేకి అప్‌డేట్ల బోనాంజా

పవన్‌ బర్త్ డే సందర్భంగా రేపు వరుసగా ఆయన నటిస్తున్న సినిమాల ప్రాజెక్ట్ లకు సంబంధించిన అప్‌డేట్‌లు ఇవ్వబోతున్నారు దర్శక, నిర్మాతలు. బ్యాక్‌ టూ బ్యాక్‌ నాలుగు సినిమాల అప్‌డేట్లు రాబోతుండటం విశేషం.  తాజాగా ఆ విషయాలను మేకర్స్‌ ప్రకటించారు. 
 

pawan kalyan movies updates will come tomorrow on pawan birthday occasion
Author
Hyderabad, First Published Sep 1, 2021, 10:22 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే అంటే అభిమానులకు పండగే. ఇక బర్త్ డే సందర్భంగా వచ్చే ట్రీట్‌లు భోనస్‌. రేపు(సెప్టెంబర్ 2)న పవన్‌ బర్త్ డే. దీంతో రేపు వరుసగా ఆయన నటిస్తున్న సినిమాల ప్రాజెక్ట్ లకు సంబంధించిన అప్‌డేట్‌లు ఇవ్వబోతున్నారు దర్శక, నిర్మాతలు. బ్యాక్‌ టూ బ్యాక్‌ నాలుగు సినిమాల అప్‌డేట్లు రాబోతుండటం విశేషం.  తాజాగా ఆ విషయాలను మేకర్స్‌ ప్రకటించారు. 

ప్రస్తుతం పవన్‌..సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో `భీమ్లా నాయక్‌` చిత్రంలో నటిస్తున్నారు. రానా మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి నుంచి రేపు టైటిల్‌ సాంగ్‌ ని 11.06 గంటలకు విడుదల చేయబోతున్నారు. తాజాగా `భీమ్లా నాయక్‌` గన్‌ లోడింగ్‌ పేరుతో సాంగ్‌ లిరిక్‌ని పంచుకున్నారు. ఇందులో పవన్‌ సరసన నిత్యా మీనన్‌, రానా సరసన ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. 

మరోవైపు క్రిష్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న `హరిహరవీరమల్లు` అప్‌డేట్‌ని ఇవ్వబోతున్నారు. మధ్యాహ్నం  1.20 నిమిషాలకు ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మేగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్‌, జాక్వెలిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

మరోవైపు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా అప్‌డేట్‌ కూడా ఇవ్వనున్నారు. `రేపు సాయంత్రం 4.05గంటలకు #pspk28` షురూ ` అని ట్వీట్‌ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

దీంతోపాటు ఎస్‌ఆర్‌టీ మూవీ నుంచి మరో అప్‌డేట్‌ ఇవ్వనున్నారు. రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో పవన్‌ ఓ సినిమా చేయనున్నారు. దీనికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఈ సినిమాకి సంబంధించి పవర్‌ఫుల్‌ అనౌన్స్ మెంట్‌ రానుందని యూనిట్‌ పేర్కొంది. మధ్యాహ్నం 2.20నిమిషాలకు ఈ అప్‌డేట్‌రానుంది. దీంతో వరుసగా తన నాలుగు సినిమాల అప్‌డేట్లు రానుండటంతో పవన్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ రాత్రి నుంచే బర్త్ డే సంబరాలు షురూ చేశారు. ఇక రేపంతా పవన్‌ ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పొచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios