గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తూ... పవన్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తున్నాడు ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్. తాను తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నానని, ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన వారిని ప్రశ్నించడం తన హక్కు అని వాదిస్తూ వస్తున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాక... పలు టీవీ చానళ్లతోపాటు మీడియా అంతటా కత్తి మహేష్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వ్యవహారం గత కొంత కాలంగా హాట్ టాపిక్ గా నిలిచింది.

అయితే ఇప్పటివరకు కత్తి మహేష్ పై భౌతిక దాడులకు పాల్పడని పవన్ ఫ్యాన్స్ తాజాగా సహనం కోల్పోయిన పరిస్థితి కనిపించింది. 99టీవీ ఛానెల్ కత్తి మహేష్ తో లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రోమోలు వేస్తోంది. ఈ ప్రోమోలు చూసిన పవన్ ఫ్యాన్స్ ప్రీ ప్లాన్ గా కత్తి మహేష్ పై కోడిగుడ్ల దాడి చేశారు.

కోడిగుడ్ల దాడి జరిగిన అనంతరం 99 టీవీ స్టూడియోలో లైవ్ లో పాల్గొంటున్నారు కత్తి మహేష్.

కులం పేరు చెప్పి తన స్థాయిని డిసైడ్ చేసినందుకే తాను పవన్ కల్యాణ్ అభిమానులపై నిరసన తెలపాల్సి వస్తోందని కత్తి మహేష్ చెప్తున్నారు.