Asianet News TeluguAsianet News Telugu

భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్.. ఎవ్వడైన వీడి ముందు గడ్డిపోస, ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది వెన్నుపూస

మ్యూజిక్ సెన్సేషన్ థమన్ స్వరపరిచిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అంచనాలకు తగ్గట్టే ఓ రేంజ్ లో ఉంది. తండా వాసి యాసతో కూడిన ఫోక్ తో మొదలైన సాంగ్ తమన్ మార్క్ ట్యూన్స్ తో సాగింది. 
 

pawan kalyan birthday special bheemla nayak title song is here
Author
Hyderabad, First Published Sep 2, 2021, 11:45 AM IST


పవన్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ చెప్పిన ప్రకారం, చెప్పిన టైం కి విడుదల చేశారు టీం. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ స్వరపరిచిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అంచనాలకు తగ్గట్టే ఓ రేంజ్ లో ఉంది. తండా వాసి యాసతో కూడిన ఫోక్ తో మొదలైన సాంగ్ తమన్ మార్క్ ట్యూన్స్ తో సాగింది. 


రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మూవీలో పవన్ పాత్రను తీరును పరిచయం చేయగా, ఆయన వాడిన పదాలు భీమ్లా నాయక్ రోల్ ని మరింత ఎలివేట్ చేసేలా ఉన్నాయి. ఎవ్వడైన వీడి ముందు గడ్డిపోస, ఎర్రి గంతులేస్తే విరిగిపోద్ది వెన్నుపూస.. వంటి లిరిక్స్ పవన్ ఫ్యాన్స్ బ్లడ్ బాయిల్ అయ్యేలా ఉన్నాయి. ప్రోమో షూట్ చేసిన విధంగా కూడా చాలా బాగుంది. అడవిలో తన మ్యూజిక్ ట్రూప్ తో  థమన్ మైమరిచి పాడుతున్నట్లు సాంగ్ షూట్ చేశారు. 


సింగర్స్ శ్రీకృష్ణ పృథ్వి, థమన్, రామ్ మిరియాల కలిసి భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఆలపించారు. సాంగ్ లో పవన్ పోస్టర్స్ దుమ్మురేపాయి. ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారికగా గబ్బర్ సింగ్ రేంజ్ లో పవన్ విశ్వరూపం చూపించనున్నట్లు టైటిల్ సాంగ్ ప్రోమో ద్వారా అర్థం అవుతుంది.  నల్లమల తండాలో పుట్టిపెరిగిన అడవి బిడ్డగా, పవన్ పాత్ర ఆకట్టుకోవడం ఖాయం. 


మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ గా భీమ్లా నాయక్ తెరక్కుతుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నిత్యా మీనన్ పవన్ కి జంటగా నటిస్తున్నారు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ భీమ్లా నాయక్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios