నటుడు నుంచి రాజకీయ నాయకుడుగా టర్న్ అయిన పవన్ కళ్యాణ్ రీఎంట్రీ పై చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయన సినిమా చేస్తారని కొంతమంది..అబ్బే అలాంటిదేమీ లేదు, రాజకీయాలకే పరిమితం అంటూ మరికొంతమంది ప్రచారం చేసారు. ఎవరేమన్నా..ఏమనుకున్నా ఈ విషయమై పవన్ మాత్రం పెదవి విప్పటం లేదు. కానీ సైలెంట్ గా ఆయన ఓ ప్రాజెక్టుని ఫైనలైజ్ చేసేసి పట్టాలు ఎక్కించేస్తున్నారు. పవన్ ప్రధాన పాత్రలో  ‘పింక్‌’ తెలుగు రీమేక్ తెరకెక్కుతోంది.

దర్శకుడు  వేణు శ్రీరామ్ ఇప్పటికే స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం నుంచి ఓ లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది.   పవన్ ఈ చిత్రం కోసం కేవలం 21 రోజులు మాత్రమే కేటాయించారని తెలుస్తోంది. ఇరవై ఒక్క రోజుల్లో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోమని దర్శక, నిర్మాతలకు చెప్పినట్లు వినపడుతోంది. ఈ మేరకు ప్లానింగ్ జరుగుతోంది. ఒక్క రోజు కూడా వేస్ట్ కాకూడదని ఖచ్చితంగా ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యారు.  

దిల్ రాజు, బోనికపూర్ నిర్మాతలుగా ఈ మూవీ రాబోతుంది.దాంతో  పింక్ రీమేక్ షూటింగ్, కాస్టింగ్ విషయమై దర్శక,నిర్మాతలు క్లారిటీతో ఏ కన్ఫూజన్ లేకుండా ఫిక్సై ఉన్నట్లు సమాచారం.  అలాగే సినిమా రిలీజ్ కూడా వేసవిలో అంటే మే నెల చివరి వారంలో రిలీజ్ చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.    మొదట ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేస్తాడని వార్తలు చాలా రోజులు హల్‌చల్ చేశాయి. కానీ బాలయ్య ఎందుకో ఆ పాత్రను పట్టించుకోలేదు.   ఇక ఇప్పటికే ఈ సినిమాని తమిళంలో  అజిత్ హీరోగా నేర్కొండ పార్వైగా రీమేక్ చేసారు. అక్కడ కూడా సంచలన విజయం సాధించింది.

ఇప్పుడు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారనే వార్త రావటంతో  పెద్ద హిట్ వచ్చినట్లే అని ట్రేడ్ అంచనా వేస్తోంది. పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా దర్శకుడు ఈ కథను మార్చేస్తున్నరు. అయితే ఇప్పటిదాకా పవన్ చేస్తున్నారని అఫీషియల్ ఎనౌన్సమెంట్ రాలేదు. మరికొద్దిరోజుల్లోనే పవన్  ఫ్యాన్స్ సంతోషపడే ప్రకటన వస్తుంది.  ఇక చిత్రం వివరాల్లోకి వెళితే...బాలీవుడ్‌, కోలీవుడ్‌లో మంచి హిట్ అయిన  చిత్రం ‘పింక్‌’. మహిళల రక్షణ చుట్టూ సాగే ఈ చిత్రం విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంది. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ కీలకపాత్రలుగా తెరకెక్కింది. 

‘పింక్‌’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌ కల్యాణ్‌ పోషించనున్నట్లు నిర్మాత బోనీ కపూర్‌ తెలిపారు.    `లాయ‌ర్ సాబ్‌` అనే టైటిల్‌ని ప‌రిశీలుస్తున్న ఈ  రీమేక్‌లో  తాప్సీ పోషించిన పాత్రను తెలుగులో నివేదా చేయనున్నారంటూ టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది.  ఈ సినిమాలో తెలుగు అమ్మాయి అంజలి కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు.  శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై రూపొందుతున్న 40వ సినిమా ఇది. అద్భుత‌మైన ట్యూన్‌తో పింక్ చిత్ర ప‌నులు మొద‌లు అయ్యాయి అని నిర్మాణ సంస్థ త‌న ప్ర‌క‌ట‌నలో తెలిపింది