ఓ స్టార్ హీరోని పట్టుకుని సినిమా చెయ్యటం అంటే మాటలు కాదు. డైరక్టర్స్ నిరంతరం ఓ యజ్ఞంలా వాళ్ల చుట్టు తిరుగుతూ, కథలు చెప్పి, వెయిటింగ్ మోడ్ లో ఉంటూంటారు. అయితే ఈ లోగా వేరే డైరక్టర్ ఎవరైనా పెద్ద హిట్ కొడితే వీళ్లను ప్రక్కన పెట్టి వాళ్లతో ప్రొసీడ్ అయ్యిపోతూంటారు. అప్పుడు అన్నాళ్లు చేసిన వెయిటింగ్ మొత్తం వృధా అయిపోతుంది. ఇప్పుడు దర్శకుడు పరుశరామ్ పరిస్దితి అదే అంటున్నారు.

విజయ్ దేవరకొండ తో చేసిన గీతా గోవిందం సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లు వసూలు చేసే హిట్ ఇచ్చినా పరుశరామ్ కు ఈ తిప్పలు తప్పలేదు. ఏ స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వలేదు. అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ కలిసినా పని అవ్వలేదు. మహేష్ బాబు కు  కథ వినిపించి , ఆయన డేట్స్ కోసం ఏడాదికి పైగా వెయిట్ చేసారు. అయితే ఇప్పటివరకూ అటూ ఇటూ తేలలేదు. మరో ప్రక్క మహేష్ వేరే దర్శకులు సినిమా ఓకే చేస్తున్నారు. ఆయన దృష్టి పాన్ ఇండియా సినిమాపై ఉంది.

ఈ నేఫధ్యంలో మహేష్ తో అయితే మరో రెండేళ్లు పట్టేటట్లు ఉందని, అప్పటికి అసలు తనెవరో అందరూ మర్చిపోతారని రియలైజ్ అయ్యి అఖిల్ తో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అఖిల్ ...బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక తన ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నాడు. మీడియం బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించే అవకాసం ఉంది.