హుషారు' వంటి యూత్ సినిమాలు ఇప్పుడు తెలుగునాట బాగా ఆడుతున్నాయి. కథలో కొత్తదనం, విభిన్నమైన టైటిల్ ఉంటే ఆ సినిమాలో ఆర్టిస్ట్ లు ఎవరైనా, బ్యానర్ ఏదైనా, దర్శకుడు కొత్తైనా జనం ఆదరిస్తున్నారు. అందుకు ఉదాహరణ రీసెంట్ గా వచ్చి హిట్టైన ఆర్.ఎక్స్ 100. 

ఆ సినిమా సక్సెస్ తో... తెలుగులో విభిన్నమైన కథలు, టైటిల్సో తో సినిమాలు వస్తున్నాయి.  ఇప్పుడు  'పకోడి' అనే టైటిల్ తో ఓ విభిన్నమైన కథా చిత్రం రాబోతోంది. ఇదో లవ్ స్టోరీ. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని నూతన సంవత్సర కానుకగా రిలీజ్ చేసారు. లైఫ్ లో ఊహించని మూవ్ మెంట్స్ కు.. పకోడి మూవ్ మెంట్స్ అని పేరు పెడుతూ.. ఈ సినిమా చేసారు.  ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ దర్శకుడు జయంత్ గాలి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా  తెలియచేసారు. 

ఇదో ఓ ఇండిపెండెంట్ సినిమా. ఇది తెలుగు సినిమానే కాని కొత్తదనం ఏమిటీ అంటే తెలుగు, తెంగ్లీష్ లో డైలాగులు ఉండబోతున్నాయి. ఈ సినిమా అర్బన్ యూత్ ని టార్గెట్ చేసారని అర్దం అవుతోంది. ఈ సినిమా మొత్తం బెంగుళూరులో షూట్ చేసారు.

కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తే మంచి స్పందన వచ్చింది.  ఈ సినిమా ఖచ్చితంగా యువతకు నచ్చే సినిమా అవుతుందని యూనిట్ అభిప్రాయపడుతోంది. ఈ సినిమాకు సాగర్ వైవివి, జితిన్ మోహన్ ఛాయాగ్రహణం అందించగా, పవన్ కుమార్ సంగీతం అందించారు. శశిథర్ చావలి ఎడిటింగ్, దండు రంజీవ్ కళా దర్శకత్వం వహించారు. దర్శకుడు జయంత్ గాలి స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది.