Asianet News TeluguAsianet News Telugu

`ఆయన నన్ను రేప్ చేసారు.. దమ్ముంటే మీ పేపర్లో వేయండి!`

తనపై ఓ ప్రముఖ సీఈఓ అత్యాచారానికి పాల్పడ్డాడని మొదట జంషెద్ ఆరోపించినా.. అప్పడు అతని పేరు బయటపెట్టలేదు. కానీ, తర్వాత అతని పేరును ట్విటర్‌ ద్వారా బయటపెట్టాడు. 

Pakistani filmmaker says he was raped
Author
Hyderabad, First Published Aug 31, 2020, 8:55 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మీటూ ఉద్యమంలో కేవలం అన్యాయం జరిగిన ఆడవాళ్లకే  కాదు.. తమకూ చోటు ఇవ్వాలని కోరుతున్నారు పాకిస్థాన్ కు చెందిన ఫిల్మ్ మేకర్ జంషెద్. ఆయన్ని ఓ ప్రముఖ దిన పత్రిక సీఈఓ రేప్ చేసారని గతంలో ఆరోపణలు చేసారు. తాజాగా మరోసారి ఆయన ఈ విషయమై మాట్లాడారు. ఈ విషయాలు పాక్ మీడియాలోనే కాక, సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే... కొద్ది కాలం క్రితం...పాకిస్థాన్‌కు చెందిన జంషెద్ మెహమూద్ అనే దర్శకుడు తనపై ఓ ప్రముఖ వార్తా పత్రికకు చెందిన సీఈఓ అత్యాచారం చేశాడని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు. తనపై ఓ ప్రముఖ సీఈఓ అత్యాచారానికి పాల్పడ్డాడని మొదట జంషెద్ ఆరోపించినా.. అప్పడు అతని పేరు బయటపెట్టలేదు. కానీ, తర్వాత అతని పేరును ట్విటర్‌ ద్వారా బయటపెట్టాడు. డాన్ పత్రిక సీఈఓ హమీద్ హరూన్ 13 ఏళ్ళ క్రితం నన్ను అత్యాచారం చేశాడు. ధైర్యం ఉంటే ఈ వార్తను మీ పత్రికలో ప్రచురించండి అన్నారు. దాంతో ఒక్కసారిగా ఆ న్యూస్ సెన్సేషన్ అయ్యింది. 

నేను కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నాను..అందేకే  మీటూ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ఈ విషయం గురించి నేను నా ప్రెండ్స్ కు చెబితే అందరూ నవ్వారు. కానీ, ఆ దారుణ ఘటనను మర్చిపోవడానికి థెరపిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందని వాపోయారు. అంతేకాదు కొన్ని నెలల పాటు పాకిస్థాన్‌కు దూరంగా ఉన్నాను. ఆ నీచుడు మా నాన్న చనిపోయినప్పుడు పరామర్శించడానికి కూడా వచ్చాడు. 

నా జీవితం నాశనం చేసిన విషయం మా నాన్నకు కూడా తెలుసని జంషెద్ మెహమూద్ ట్వీట్‌లో పేర్కొనటం విశేషం. అయితే దాదాపు సంవత్సరం క్రితం విషయం ఇప్పుడు మళ్లీ వైరల్ అవటం మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయన డైరక్ట్ చేసిన మూర్ అనే సినిమాకు మంచి పేరు వచ్చింది. మూర్ అంటే తల్లి అని అర్దం. 

Follow Us:
Download App:
  • android
  • ios