వర్మ తొక్కేస్తున్నాడు.. నాగార్జున గారు ప్లీజ్ హెల్ప్!

వర్మ తొక్కేస్తున్నాడు.. నాగార్జున గారు ప్లీజ్ హెల్ప్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కథను కాపీ చేసి 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' సినిమా తీశారని గతంలో వర్మ వద్ద రచయితగా పని చేసిన జయకుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా జయకుమార్ మరోసారి వర్మపై ఆరోపణలు చేస్తున్నారు. నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన 'ఆఫీసర్' సినిమా కథ తనదేనంటూ నిన్న జయకుమార్ మీడియాకు ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. అందులో వర్మను ఉద్దేశిస్తూ జయకుమార్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

వర్మ దగ్గర దాదాపు తన కథలు తొమ్మిది వరకు ఉన్నాయని, ఆ కథలు నచ్చలేదని పక్కన పెట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా సినిమాలు తీస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై వర్మ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో జయకుమార్ నాగార్జునను సహాయం చేయమని కోరుతున్నాడు.

''నాగార్జున గారు మీరు సదరు డైరెక్టర్ గారికి మీరు బ్రేక్ ఇచ్చారు కానీ ఆయన కొత్త వాళ్ళ కెరీర్స్ ని బ్రేక్ చేస్తున్నాడు. దయచేసి న్యాయం చెయ్యండి'' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మరొక ట్వీట్ లో నాగార్జున గారు మిమ్మల్సి రీచ్ కావడానికి వేరే దారిలేక ఓపెన్ లెటర్ ఫార్మేట్ ఎంచుకున్నానే కానీ కొత్తవాళ్ళకు అవకాశాలిచ్చి ఇండస్ట్రీని అభివృద్ధి చేసిన మీ మీద నా రెస్పెక్ట్ ఎప్పటికీ పోదు అంటూ వర్మ తన వద్ద కాపీ కొట్టిన పాతిక పేజీల స్క్రిప్ట్ ను సోషల్ మీడియా ద్వారా లీక్ చేశారు.

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos