ప్రముఖ నిర్మాత దిల్ రాజు ..డిస్ట్రిబ్యూటర్ గానూ కావాల్సినంత అనుభవం ఉంది. ఏ ఏరియాలో ఏ తరహా సినిమాకు ఎంత రేటు పలుకుతుందో నిద్రలో లేపి అడిగినా చెప్పేయగలడు అనే పేరు ఉంది. అయితే వరసగా ఆయన సినిమాలు డిజాస్టర్ అవటం,కరోనా వైరస్ ఎఫెక్ట్..ఆయన బిజినెస్ పడిందిట. ముఖ్యంగా ఓవర్ సీస్ లో థియోటర్స్ కు జనం ఎవరూ వెళ్లటం లేదు. దాంతో రిలీజ్ వాయిదా వేసుకోమని చెప్పారట. అబ్బే ..అది కుదరదని దిల్ రాజు అనటంతో...ఇప్పటిదాకా దిల్ రాజు ఏ సినిమాకు కూడా అడగనంత చిన్న మొత్తానికి ఓవర్ సీస్ రైట్స్ అడిగారట. 

ఈ సినిమాకు తాము ఓపినింగ్స్ వస్తాయని అనుకోవటం లేదని, కాబట్టి తాము నష్టపోకుండా ఉండటం కోసం ఇంత తక్కువ రేటుకు అడిగామని ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పారట. కానీ దిల్ రాజు ఆ దెబ్బ నుంచి కోలుకోలేదట. ఆలోచించి ఫోన్ చేస్తానని అన్నారుట.ఎప్పుడు సాధారణంగా దిల్ రాజే ...ఓ రేటు చెప్పి తమ సినిమా రైట్స్ విషయమై డిమాండ్ చేస్తూంటారు. కానీ ఈ సారి రివర్స్ లో నడుస్తోంది. ఇదంతా నాని హీరోగా నటించే వి సినిమాకు. ఈ సినిమాకు సరైన బజ్ క్రియేట్ కాకపోవటం కూడా ఓ కారణం అని చెప్తున్నారు.
  
ఈ నేపథ్యంలో నాని నటించిన వి రిలీజ్ అయితే రికవరీ కష్టం అవుతుందనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అవ్వటం మొదలైంది. ఓవర్సీస్ బిజినెస్ మాత్రమే కాక ఇప్పుడు తెలంగాణాలో కూడా కరోనా ఎఫెక్ట్ కనపడటంతో భయం భయంగా ఉన్నాయి పరిస్దితులు. అలాగే అమెరికా లో ముప్పై మందికి పైగా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారనే వార్త అక్కడ కలకలం రేపుతోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని దిల్ రాజు ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ట్రేడ్ వర్గాల్లో చర్చగా మారింది.