పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైం పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ పవన్ తో భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఉత్తర భారతాన్ని వందల ఏళ్ళు ఏలిన మొఘలుల కాలం నాటి కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో పవన్ ఓ బందిపోటు దొంగగా నటిస్తున్నారు. పెద్దలను దోచి పేదలకు పెట్టే రాబిన్ హుడ్ తరహాలో పవన్ పాత్ర ఉండనుంది. దొంగగా పవన్ చేసే మెరుపు దాడులు, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయి. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ టైటిల్ పై రోజుకో వార్త చక్కర్లు కొడుతుంది. ఈ చిత్ర టైటిల్ పై ఇప్పటికే అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు క్రిష్ ఈ చిత్రం కోసం విరూపాక్ష అనే క్లాసిక్ టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అలాగే పవన్ పాత్రకు సరిపోయేలా గజదొంగ, బందిపోటు అనే మాస్ టైటిల్స్ పరిశీలిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. పవన్ బర్త్ డే నాడు దీనిపై స్పష్టత వస్తుందని అందరూ భావించారు. దర్శకుడు మాత్రం కేవలం ప్రీ లుక్ తో సరిపెట్టారు. 

తాజాగా ఈ చిత్ర టైటిల్ పై మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. దర్శకుడు క్రిష్ 'ఓం శివమ్' అనే పవర్ ఫుల్ టైటిల్ ఈ చిత్రం కోసం అనుకుంటున్నారట. మాస్ అండ్ డివోషనల్ టచ్  కలిగిన ఈ టైటిల్ సినిమాకు బాగా సరిపోతుందని ఆయన ఆలోచనట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, భారీగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలుకాగా లాక్ డౌన్ తో బ్రేక్ పడింది. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయిన వెంటనే పవన్ క్రిష్ మూవీ షూట్ లో పాల్గొననున్నారు.