Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్‌లో మరో పోర్న్ వీడియోల రాకెట్‌.. నిర్మాతపై కేసు

ఓ వైపు రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసు బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరో పోర్న్ వీడియోల రాకెట్‌ వెలుగులోకి వచ్చింది. 

one more porn videos racket in bollywood case files on producer
Author
Hyderabad, First Published Aug 6, 2021, 2:47 PM IST

బాలీవుడ్‌లో మరో పోర్నోగ్రఫీ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసు బాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంది. ఈ కేసు విచారణ జరుగుతున్న క్రమంలో మరో పోర్న్ రాకెట్‌ కేసు వెలుగులోకి వచ్చింది. అశ్లీల చిత్రాల పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారన్న కారణంతో హిందీ నిర్మాత విభూ అగర్వాల్‌పై కేసు నమోదైంది. 

అసభ్యత, అశ్లీల కంటెంట్‌తో వీడియాలు రూపొందిస్తున్న అంశంపై ఉల్లూ యాప్‌ డిజిటల్‌ ప్రై.లి. కంపెనీ సీఈవో అయిన విభూ అగర్వాల్‌, కంపెనీ హెడ్‌ అంజలీ రైనాలపై అంబోలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు ముంబై పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై ఐపిసి సెక్షన్ 354 కింద ఈ నెల 4న కేసు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అంధేరీలోని ఉల్లూ ఆఫీస్‌లోని స్టోర్‌ రూమ్‌లో 28 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

2013లో బాత్‌ బాన్‌ గయూని సినిమా నిర్మించిన విభూ అగర్వాల్‌.. `డాన్స్ బార్` సినిమాతోపాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లను నిర్మించారు. ఆ తర్వాత  2019లో ఉల్లూ యాప్‌ను ప్రారంభించి హిందీ, ఇంగ్లీష్‌, భోజ్‌పురి, తెలుగు, మరాఠీ సహా వివిధ భాషల్లో అశ్లీల కంటెంట్‌తో వీడియోలు రూపొందించినట్లు తెలుస్తుంది. ఉల్లూ యాప్‌ నిర్వహణతో పాటు వీడియోల పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు విభూ అగర్వాల్‌పై ఆరోపణలు ఉన్నాయి.  ఓ వైపు రాజ్‌కుంద్రా కేసు సంచలనంగా మారి నేపథ్యంలో ఇప్పుడు మరో పోర్న్ రాకెట్‌ బయటకు రావడం బాలీవుడ్‌ని కలవరానికి గురి చేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios