బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆదిపురుష్ ప్రకటించిన నాటి నుండి ఈ మూవీ విశేషాలు తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్ తో ఈచిత్రం తెరకెక్కుతుండగా, చిత్రంపై భారీ హైప్ ఏర్పడింది. మొదటిసారి ఓ పౌరాణిక చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు.  రామునిగా ప్రభాస్ ఎలా ఉంటాడో చూడాలనే ఆసక్తి ఆయన ఫ్యాన్స్ లో మొదలైపోయింది. దాదాపు ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో విజువల్ వండర్ గా ఆదిపురుష్ తెరకెక్కనుంది. 

ఇక రామాయణ కథలో ప్రతినాయక పాత్ర లంకేశ్వరుడుగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. రావణాసురిడి పాత్ర సైఫ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేసింది. రాముడు గెటప్ లో ప్రభాస్ ఎదుర్కొనే పదితలల రావణుడు సైఫ్ అలీ ఖాన్ అని తెలిసిపోయింది.కాగా ముఖ్యమైన సీత పాత్ర ఎవరు చేయనున్నారనే ఆసక్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. చిత్ర యూనిట్ దీనిపై ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. కొందరు బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చినా స్పష్టత ఐతే రాలేదు. 

తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రతెలా పేరు తెరపైకి వచ్చింది. ఆదిపురుష్ మూవీలో సీత పాత్రకు ఊర్వశి బాగుంటారని దర్శక నిర్మాతల ఆలోచనగా తెలుస్తుంది. కాగా ఆదిపురుష్ లో ప్రభాస్ పక్కన సీత పాత్రలో ఊర్వశి కనిపించే అవకాశం కలదని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో అంత పాపులారిటీ లేని ఈ హీరోయిన్ ని ఇంత పెద్ద ప్రాజెక్ట్ కోసం తీసుకుంటారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఆదిపురుష్ మూవీ 2022 లేదా 2023లో విడుదల అయ్యే ఆస్కారం కలదు.