Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ షోకి ఓ దండం... నోటి దూల వ్యాఖ్యలతో అడ్డంగా దొరికిపోయిన లోబో.. నెటిజన్స్ ఫైర్

గతంలో లోబో ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో పట్ల నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఓ యాంకర్...  మీరు బిగ్ బాస్ షో చూస్తున్నారా? అని అడుగగా... ఆ షో అంటే నాకు నచ్చదు, అది నా టేస్ట్ కాదు, ఆ షోకి ఒక దండం... అన్నారు.

once lobo made negative comments on bigg boss show now netijens trolling him
Author
Hyderabad, First Published Sep 7, 2021, 1:15 PM IST

కాలు జారితే తీసుకోవచ్చు నోరు జారితే తీసుకోలేం.. ఇది పెద్దలు చెప్పిన అక్షర సత్యం.విషయం ఏదైనా స్పందించే ముందు ఓ క్షణం ఆలోచించాలి. మైకు ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడితే, ఇదిగో ఇలా అడ్డంగా బుక్కైపోతారు. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నటుడు, యాంకర్ లోబో హౌస్ లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. సీజన్ మొదలై కేవలం రెండు ఎపిసోడ్స్ మాత్రమే పూర్తి కాగా, లోబో కంటెస్టెంట్స్ కి, ప్రేక్షకులకు నవ్వులు పంచే ప్రయత్నం చేస్తున్నారు. 

కాగా గతంలో లోబో ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో పట్ల నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఓ యాంకర్...  మీరు బిగ్ బాస్ షో చూస్తున్నారా? అని అడుగగా... ఆ షో అంటే నాకు నచ్చదు, అది నా టేస్ట్ కాదు, ఆ షోకి ఒక దండం... అన్నారు. అందుకే మీకు అవకాశం వచ్చినా షోకి వెళ్లలేదా? అని యాంకర్ మరో ప్రశ్న అడుగగా... నాకు అవకాశం రాకపోవడమే మంచిది. నాకు ఆ షోకి వెళ్లాలని లేదని, బిగ్ బాస్ షోను కించ పరిచేలా వ్యాఖ్యలు చేశారు. 

తీరా లేటెస్ట్ సీజన్లో పాల్గొన్న లోబో పై నెటిజెన్స్ మీమ్స్, కామెంట్స్ తో దాడి చేస్తున్నారు. బిగ్ బాస్ కి వెళ్లానంటూ లోబో చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో బయటకు తీసి ఏకి పారేస్తున్నారు. ప్రస్తుతం లోబో వీడియో వైరల్ గా మారింది. మరో వైపు బిగ్ బాస్ మొదటి ఎలిమినేషన్ కి గాను నామినేషన్స్  పూర్తి కావడం జరిగింది. ఆర్జే కాజల్, సిరి హన్మంత్, జస్వంత్, రవి, హమీద, మానస్ మొదటివారం ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios