నటి పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేయగా వివాదం కొనసాగుతుంది. ఈ వివాదంలో బాలీవుడ్ ప్రముఖులు భిన్న అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అనురాగ్ కశ్యప్ మాజీ భార్యలు ఆర్తి బజాజ్, కల్కి మరియు హీరోయిన్స్ తాప్సి, రాధికా ఆప్టే లాంటి వారు అనురాగ్ గొప్ప వ్యక్తిత్వం కలవడానికి, ఆయన అలాంటి వారు కాదని మద్దతు ప్రకటించారు. కంగనా రనౌత్ తో పాటు మరికొందరు పాయల్ ని సపోర్ట్ చేయడమా జరిగింది. 

కాగా అనురాగ్ క్యారెక్టర్ గురించి మరికొన్ని సంచలన ఆరోపణలు పాయల్ ఘోష్ చేయడం జరిగింది. పాయల్ మాట్లాడుతూ ...మొదటిసారి పాయల్ అనురాగ్ ఇంటికి వెళ్లినప్పుడు వీరిద్దరూ కలిసి వంట చేశారట. అల్పాహారం తిన్నాక సినిమా గురించి అనేక విషయాలు కొత్త ఆలోచనలు పంచుకున్నారట. ఐతే  సెకండ్ టైం అనురాగ్ ఇంటికి వెళ్ళినప్పుడు తన ప్యాంటు జిప్ తీయడంతో పాటు, తన సల్వార్ కమీజ్ ని విప్పబోయారని పాయల్ చెప్పడం జరిగింది. 

అలాగే తనతో పనిచేసిన చాలా మంది హీరోయిన్స్ దీనికి అంగీకరించారని అన్నారట అనురాగ్.  తాను ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి తనకు కావలసిన విధంగా ప్రవర్తించే హీరోయిన్స్ ఉన్నారని అనురాగ్ చెప్పినట్లు పాయల్ ఘోష్ ఆరోపణలు చేశారు. తాజా ఆరోపణలతో పాయల్ మరింత వివాదం రాజేసింది. పాయల్ ఇంతటి ఘాటు వ్యాఖ్యలు చేయగా, అనురాగ్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.