Asianet News TeluguAsianet News Telugu

పొట్టలు చెక్కలై నేటికి 20 ఏళ్ళు.. మీమ్స్ కి గని లాంటి సినిమా

కామెడీతో క్లాసిక్ హిట్స్ అయ్యే చిత్రాలు చాలా అరుదు. ఆ కోవకు చెందిన చిత్రమే నువ్వు నాకు నచ్చావ్. విక్టరీ వెంకటేష్, అందాల భామ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది.

Nuvvu naku nachav comletes 20 years
Author
Hyderabad, First Published Sep 6, 2021, 6:05 PM IST

కామెడీతో క్లాసిక్ హిట్స్ అయ్యే చిత్రాలు చాలా అరుదు. ఆ కోవకు చెందిన చిత్రమే నువ్వు నాకు నచ్చావ్. విక్టరీ వెంకటేష్, అందాల భామ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది. విజయభాస్కర్ దర్శకత్వం వచించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6, 2001న విడుదలై అఖండ విజయం సొంతం చేసుకుంది. ఈ సూపర్ హిట్ చిత్రం 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 

ఈ చిత్రానికి త్రివిక్రమ్ రాసిన మాటలు, కామెడీ సన్నివేశాలు ఆయువు పట్టు అని చెప్పాలి. దానికి తోడు వెంకటేష్ తన డైలాగ్ డెలివరీతో ప్రతి కామెడీ పంచ్ ని హైలైట్ చేశారు. 

వెంకటేష్, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యాయి. డైనింగ్ టేబుల్ సీజ్, లేటుగా వచ్చినందుకు వెంకీ కారణం చెప్పే సీన్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఆ సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అలవాటుగా మారిన మీమ్స్ కి గనిలా మారాయి. 

అందుకే ఈ చిత్రం ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించదు. ఈ చిత్రానికి కోటి అందించిన సంగీతం మరో హైలైట్. ఈ చిత్రం టాలీవుడ్ లో రచయితగా త్రివిక్రమ్ స్థాయిని పెంచింది. త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక వెంకటేష్ తో సినిమా అంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజంగా ఆ కాంబినేషన్ సెట్ అయితే హాస్య ప్రియులకు పండగే. 

Follow Us:
Download App:
  • android
  • ios