ఒక్క కట్ కూడా లేకుండా రిలీజ్ అవుతున్న న్యూడ్ మూవీ

First Published 30, Mar 2018, 9:36 AM IST
Nude movie releasing with out any censor cuts
Highlights
ఒక్క కట్ కూడా లేకుండా రిలీజ్ అవుతున్న న్యూడ్ మూవీ

మన దేశంలో సినిమా తీయాలంటే చాలా జాగ్రత్తగాద తియ్యాలి. ఏది పడితే అది తీస్తే సెన్సార్ బోర్డు వాళ్లు ఊరుకోరు. వాళ్లకి ఎక్కడ అసభ్యంగా అనిపిస్తే అక్కడ కట్ చెప్పేస్తారు. అయితే వీటన్నిటిని దాటుకుని విడుదలకు రెడీ అవుతుంది న్యూడ్ అనే మరాఠీ మూవీ. పేరులోని న్యూడ్ అని ఉంది కదా మన సెన్సార్ బోర్డ్ ఎన్ని కత్తిరింపులు చేసింటుందో అని అందరు అనుకుంటున్నారు.కానీ ఈ చిత్రానికి ఎలాంటి కట్ చెప్పలేదు సెన్సార్. ఒ తల్లి తన కొడుకు కోసం మంచి చదువు చెప్పించాలనే నగ్నంగా ఆర్ట్ కాలేజ్ విద్యార్ధల ముందు కూర్చుంటుంది అదే ఈ చిత్రం కథ. ఈ చిత్రానికి సంభందించిన ట్రైలర్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. ఇలాంటి సబ్జెక్ట్ ను సీబీఎఫ్ సి అంతా సింపుల్ గా సర్టిఫికెట్ ఇవ్వదని మనవాళ్లు అనుకుంటు ఉన్నారు. అయితే ఆశ్చర్యంగా ఒక కట్ లేకుండా A సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్. రవిజాదవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

loader