బాహుబలి వచ్చిన తర్వాత అందరూ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా అవతరించాలని ఉత్సాహపడుతున్నారు. అందుకోసం తమ ప్రాజెక్టులను ఆ దిశగా నడిపించేందుకు  ప్రయత్నాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్దాయిలో వర్కవుట్ అయ్యే కథలకే ప్రయారిటీ ఇస్తున్నారు. అవకాసం వస్తే ఇతర భాషల  భారీ చిత్రాల్లోనూ నటించటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మార్కెట్ పెరిగేందుకు ఏయే మార్గాలు ఉన్నాయో అవన్నీ అన్వేషిస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా సినిమాల వైపు మ్రొగ్గు చూపెడుతున్నట్లు సమాచారం. లోకల్ కథలు కన్నా దేశంలో అందరికీ నచ్చే కథలు అయితేనే ఓకే చేస్తున్నట్లు చెప్తున్నారు. 

ఇలా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిపోతున్నారనే వార్త ఇప్పుడు ఆయన అభిమానులను ఆనందపరవశంలో ముంచెత్తుతోంది. ఎన్టీఆర్ తన వరుస సినిమాలను పాన్ ఇండియా లెవల్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. రెండు సినిమాలు లైన్‌లో ఉండగానే ఎన్టీఆర్ హీరోగా చేయ‌బోయే 31వ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి మీడియా వర్గాల్లో  హ‌ల్ చ‌ల్ చేస్తుంది. 

ఇప్పటికే  ఎన్టీఆర్ 29 ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌పైనే ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కాబట్టి ఇది పాన్ ఇండియా మూవీగానే విడుదలవుతుంది. అలాగే త్రివిక్రమ్ మూవీని కూడా తారక్ అలాగే పాన్ ఇండియా మూవీగానే ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. అదే క్రమంలో తార‌క్ 31వ సినిమాని సైతం పాన్ ఇండియా స్దాయి అంటున్నారు. ఇంతకీ ఆ సినిమాకు డైరక్టర్ ఎవరూ అంటే సంజయ్ లీలా భన్సాలీ అని చెప్తున్నారు. 

బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత సంజయ్‌లీలా బ‌న్సాలీ ద‌ర్శ‌కత్వంలో ఓ భారీ చారిత్రాత్మ‌క చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటిస్తార‌ని చెప్పుకుంటునన్నారు. బాలీవుడ్ హీరో ర‌ణ్వీర్ సింగ్ ఇందులో విల‌న్‌గా న‌టిస్తార‌ని కూడా టాక్‌. అయితే ఇది కేవలం క్రేజ్ కోసం ఎవరైనా పుట్టించినా వార్త కాదా అని తెలియలేదు. ఎందుకంటే డైరక్ట్ గా ఎన్టీఆర్ హీరోగా హిందీ సినిమా ప్లాన్ చేయటం అనేది కష్టమైన విషయం. కమర్షియల్ గా ఇబ్బంది పెడుతుంది. అదే తెలుగులో చేసి హిందీలోనూ రిలీజ్ చేయటం అంటే వేరే.