అభిమానులకు నందమూరి హీరోలు న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపారు. మరోవైపు ఎనర్జిట్‌ హీరో రామ్‌, సూర్య, నాని, నిఖిల్‌ 2021కి వెల్‌ కమ్‌ పలికారు. తమదైన స్టయిల్‌లో న్యూ ఇయర్‌ విషెస్‌ని అభిమానులకు అందించారు. 

ఎన్టీఆర్‌ చెబుతూ, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు మరో నందమూరి హీరో కళ్యాణ్‌ సైతం `మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు` అని సింపుల్‌గా చెప్పేశారు. 

`ఇస్మార్ట్` హీరో రామ్‌ సైతం విషెస్‌ తెలిపారు. కొత్త ఏడాది పండగ చేసుకోండి, ఎంజాయ్‌ చేయండి, కానీ సేఫ్‌గా ఉండాలని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని పంచుకున్నారు. ఇందులో ఆయన ప్రస్తుతం నటిస్తున్న `రెడ్‌` చిత్రం ఈ నెల 14న విడుదల కానుందని, ఆదరించాలని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన `డించక్‌ డించక్‌` సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తుందని తెలిపారు. 

హీరో సూర్య చెబుతూ, వచ్చే ఏడాది అద్భుతంగా ఉండాలని, అందరు మంచి ఆరోగ్యం, ప్రేమతో, సంతోషంతో ఉండాలన్నారు. నేచురల్ స్టార్‌ నాని సైతం విషెస్ తెలిపారు.

ఇటీవల లాక్‌ డౌన్‌ టైమ్‌లో ఓ ఇంటివాడైన యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రస్తుతం హాలీడేస్‌ లో ఎంజాయ్‌ చేస్తున్నారు. మంచు పర్వతాలపై  నుంచి ఆయన విషెస్‌ తెలిపారు.