`ఆర్‌ఆర్‌ఆర్‌` షూటింగ్‌కి టైమ్‌ ఫిక్స్..? ఈ సారి అలా ఇలా కాదట..

ఎనిమిది నుంచి పది వారాల్లో షూటింగ్‌ మొత్తం పూర్తి కానుందట. క్లైమాక్స్ సన్నివేశాలు, సాంగ్‌ షూటింగ్‌లు బ్యాలెన్స్ ఉన్నాయని టాక్‌. ఇదిలా ఉంటే ఇప్పుడు తిరిగి షూటింగ్‌ని స్టార్ట్ చేయాలని రాజమౌళి టీమ్‌ భావిస్తుందట.

ntr ram charan starrer RRR shooting start from july makers plan ? arj

తెలుగులో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, అలియా భట్‌, ఒలివీయా మోర్రీస్‌ కథానాయికలుగా, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని కీలక పాత్రలుగా సినిమా తెరకెక్కుతుంది. దాదాపు నాలుగువందల కోట్ల బడ్జెట్‌తో డి వివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. మొదట ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు గాయాలు కావడం, తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌తోపాటు విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది.

కరోనా సెకండ్‌ వేవ్‌లోనూ మరోసారి షూటింగ్‌ వాయిదా పడింది. అయితే సినిమా షూటింగ్‌ దాదాపు 90శాతం పూర్తయ్యింది. ఎనిమిది నుంచి పది వారాల్లో షూటింగ్‌ మొత్తం పూర్తి కానుందట. క్లైమాక్స్ సన్నివేశాలు, సాంగ్‌ షూటింగ్‌లు బ్యాలెన్స్ ఉన్నాయని టాక్‌. ఇదిలా ఉంటే ఇప్పుడు తిరిగి షూటింగ్‌ని స్టార్ట్ చేయాలని రాజమౌళి టీమ్‌ భావిస్తుందట. జులై మొదటి వారంలో షూటింగ్‌ని స్టార్ట్ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు పునఃప్రారంభం అవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో తాము కూడా రంగంలోకి దిగాలని జక్కన్ల ప్లాన్‌ చేస్తున్నారట. అతి కొద్ది మందితోనే షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారట మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా మొదలు పెట్టారట. ఇప్పటికే హీరోలు ఇద్దరితో పాటు సినిమాలో నటిస్తున్న కీలక నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు కూడా జులై మొదటి వారం నుండి షూటింగ్ కు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పాడట జక్కన్న. ఈ సారి అలా ఇలా కాకుండా, ఏమాత్రం ఆలస్యం లేకుండా బ్యాక్‌ టూ బ్యాక్‌ షూటింగ్‌ జరపాలని, షూటింగ్‌ పూర్తి చేయాలని అనుకుంటున్నారట. మరి అది సాధ్యమవుతుందా? అన్నది చూడాలి. ఇదిలా ఉంటే రిలీజ్‌ డేట్‌పై కూడా సస్పెన్స్‌ నెలకొంది. సినిమా అక్టోబర్‌ 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇది సంక్రాంతికి వెళ్లే అవకాశాలున్నాయని టాక్‌. ఏం జరుగుతుందో చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios